ఏపీలో బీఆర్ఎస్ కు ప్రజామోదం ఉండదు: బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు

By narsimha lode  |  First Published Jan 3, 2023, 3:03 PM IST


ఏపీలో బీఆర్ఎస్ కు ప్రజల ఆమోదం ఉండదని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  చెప్పారు. ఏపీలో ప్రాజెక్టులను కేసీఆర్ అడ్డుకున్నాడని  ఆయన  ఆరోపించారు.  


అమరావతి: ఏపీలో  బీఆర్ఎస్ కు ప్రజల ఆమోదం ఉండదని  బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు  సోము వీర్రాజు చెప్పారు. మంగళవారంనాడు కర్లోనూల్ లో    సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.   టీఆర్ఎస్ కు   వీఆర్ఎస్ ఇవ్వాల్సి వస్తుందనే  బీఆర్ఎస్ ను కేసీఆర్ ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణలో  షుగర్ ఫ్యాక్టరీని కేసీఆర్ సర్కార్ విక్రయించలేదా అని ఆయన ప్రశ్నించారు. విశాక స్టీల్ ఫ్యాక్టరీపై  కేసీఆర్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని  ఆయన విమర్శించారు. ఏపీలో  ప్రాజెక్టులను కేసీఆర్ అడ్డుకోలేదా  అని ఆయన అడిగారు.  పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిందో  చెప్పాలని  ఆయన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. 

కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి అంటూ ఆయన  తీవ్రంగా విమర్శించారు.  దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ లేకుండా  చేశారన్నారు.   ప్రజలను రెచ్చగొట్టి  అధికారంలోకి  వచ్చిన నీచుడు  కేసీఆర్ అని  సోము వీర్రాజు  విమర్శించారు.  రాయలసీమకు నీళ్లు లేకుండా  కేసీఆర్ చేశారన్నారు. ఏపీకి కేసీఆర్ చేసిన అన్యాయంపై  ఒకే వేదికపై  తేల్చుకొనేందుకు  తమ పార్టీ సిద్దంగా  ఉందని  కూడా  సోము వీర్రాజు  తేల్చి చెప్పారు.ఏపీలో పోలవరం ముంపు  మండలాలను తెలంగాణలో ఉంచుకోవడం వల్ల  రాయలసీమకు  నీళ్లు ఇవ్వలేని పరిస్థితి  నెలకొందని ఆయన  అభిప్రాయపడ్డారు.ఏపీలో పోలవరం ముంపు  మండలాలను తెలంగాణలో ఉంచుకోవడం వల్ల  రాయలసీమకు  నీళ్లు ఇవ్వలేని పరిస్థితి  నెలకొందని ఆయన  అభిప్రాయపడ్డారు.  నిజామాబాద్ లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీని  తిరిగి  జాతీయం చేస్తారా అని  కేసీఆర్ ను ప్రశ్నించారు  సోము వీర్రాజు. 

Latest Videos

undefined

also read:బహిరంగ క్షమాపణ చెప్పి ఏపీలో అడుగు పెట్టాలి:కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  తోట చంద్రశేఖర్ , రావెల కిషోర్ బాబు,  పార్థసారథి తదితరులు  నిన్న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో  చేరారు.  ఏపీ  నుండి పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని  కేసీఆర్  చెప్పారు.   సిట్టింగ్ లు కూడా  బీఆర్ఎస్ లో చేరేందుకు  ఆసక్తిగా  ఉన్నారని కేసీఆర్ చెప్పారు. రానున్న రోజుల్లో  ఏపీకి చెందిన కీలక నేతలు  బీఆర్ఎస్ లో చేరుతారని కేసీఆర్  చెప్పారు. 

click me!