బట్టలూడదీసుకుని రోడ్డుపైకి చంద్రబాబు: కన్నా సంచలన వ్యాఖ్యలు

Published : Oct 04, 2018, 06:02 PM ISTUpdated : Oct 04, 2018, 06:06 PM IST
బట్టలూడదీసుకుని రోడ్డుపైకి చంద్రబాబు: కన్నా సంచలన వ్యాఖ్యలు

సారాంశం

సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి సైంధవుడిలా చంద్రబాబు నాయుడు దాపురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదన్న కన్నా త్వరలోనే చంద్రబాబు బట్టలూడదీసుకోని రోడ్డుపై తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి సైంధవుడిలా చంద్రబాబు నాయుడు దాపురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదన్న కన్నా త్వరలోనే చంద్రబాబు బట్టలూడదీసుకోని రోడ్డుపై తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. . 

రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ తో చంద్రబాబు జతకట్టారని మండిపడ్డారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన సమయంలోనే చంద్రబాబు కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సోమ్ముతో పోలవరం విహార యాత్రలు చేస్తున్నారని కన్నా విమర్శించారు. కేంద్ర నిధులతో ప్రాజెక్టు కడుతూ చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. 

మరోవైపు రాయలసీమలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో మంత్రి పరిటాల సునీత చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రాయలసీమలో అభివృద్ధి జరగలేదని తాను చాలెంజ్ చేసి చెప్తున్నానని అన్నారు. రాయలసీమ అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. 

రాజధాని పేరుతో  వ్యాపారం చేసుకోవడం తప్ప టీడీపీ చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు దొంగ మాటలకు సీఎస్ దినేశ్‌కుమార్ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. విభజన హామీల విషయంలో మన్మోహన్‌సింగ్‌, మోదీల ప్రసంగం మార్ఫింగ్ చేసి టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, టీడీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరిస్తామని కన్నా తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్