సీఎం రమేష్, వరదరాజుల రెడ్డి మధ్య వార్: చంద్రబాబు సీరియస్

By Nagaraju TFirst Published Oct 4, 2018, 3:51 PM IST
Highlights

కడప జిల్లా టీడీపీలో తెలుగుతమ్ముళ్ల కొట్లాటపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉప్పు నిప్పులా రగిలిపోతున్న ఎంపీ సీఎం రమేష్, మాజీఎమ్మెల్యే వరదరాజులరెడ్డిలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరునేతలు బహిరంగంగా విమర్శించుకోవడం, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 22 మంది కౌన్సిలర్లు రాజీనామా వ్యవహారంపై సీరియస్ అయ్యారు. 

అమరావతి: కడప జిల్లా టీడీపీలో తెలుగుతమ్ముళ్ల కొట్లాటపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉప్పు నిప్పులా రగిలిపోతున్న ఎంపీ సీఎం రమేష్, మాజీఎమ్మెల్యే వరదరాజులరెడ్డిలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరునేతలు బహిరంగంగా విమర్శించుకోవడం, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 22 మంది కౌన్సిలర్లు రాజీనామా వ్యవహారంపై సీరియస్ అయ్యారు. 

పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై సీఎం చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందన్న చంద్రబాబు ఈనెల 6న ఇరు వర్గాలతో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు.   

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీలో అంతర్గత విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జ్ వరదరాజుల రెడ్డిలు ఒకరిపై ఒకరు యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. 

సీఎం రమేష్, వరదరాజులరెడ్డిలకు మధ్య వార్ నడుస్తున్నప్పటికీ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. అయితే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్ల రాజీనామాతో అంతర్గత కుమ్ములాటలు మళ్లీ బయటపడ్డాయి. 

నియోజకవర్గ ఇంచార్జ్ వరదరాజుల రెడ్డి తీరును నిరసిస్తూ మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. కౌన్సిలర్ల రాజీనామా వెనుక సీఎం రమేష్ హస్తం ఉందని వరదరాజుల రెడ్డి ఆరోపిస్తున్నారు. తాను జీవించి ఉన్నంత వరకూ సీఎం రమేశ్‌ కుటుంబాన్ని ప్రొద్దుటూరు రాజకీయాల్లోని రానివ్వనని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. 

సీఎం రమేశ్‌ కనుసన్నల్లోనే ప్రొద్దుటూరులో కౌన్సిలర్లు రాజీనామాలు చేశారన్న వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరు టీడీపీలో జరుగుతున్న అల్లర్ల వెనక సీఎం రమేశ్‌ పాత్ర ఉందన్నారు. ప్రొద్దుటూరులో టీడీపీకి చెందిన 22 మంది కౌన్సిలర్లు, తమ పదవులకు రాజీనామా చేశారు. 

click me!