ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల విషయమై బీజేపీ నాయకత్వం ఈ వారంంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఎలా వెళ్ళాలనే అని కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు.శనివారం నాడు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఎన్నికల కమిటీలో చర్చించనున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ నెల 27 న కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాధ్ సింగ్ ఏపిలో పర్యటించబోతున్నారన్నారు.
also read:టీడీపీ-జనసేన తొలి జాబితా: సీటు దక్కని నేతల్లో అసంతృప్తి, నిరసనలు
undefined
పార్లమెంట్ క్లస్టర్ లతో వరుస సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. విశాఖలో మేధావులతో సమావేశం వుంటుందని ఆయన తెలిపారు.విజయవాడ లో ఐదు పార్లమెంట్ కోర్‌కమిటీ నేతలతో సమావేశం నిర్వహిస్తామని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అనంతరం గోదావరి క్లస్టర్ల సమావేశం లో రాజ్‌నాధ్ సింగ్ పాల్గొంటారని జీవీఎల్ వివరించారు. రాష్ట్రంలో బిజెపి వ్యవహారాలను జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.
also read:తొలి జాబితా: టీడీపీ సీనియర్లకు దక్కని చోటు, ఎందుకంటే?
ఎన్నికలకు పూర్తిస్ధాయిలో సమాయత్తం అవుతున్నామని జీవీఎల్ నరసింహరావు తెలిపారు. పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యాచరణ ప్రకారం వెళ్తున్నామన్నారు. తాము ఎక్కడ నుంచి పోటీ చేయాలని జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని జీవీఎల్ నరసింహరావు తెలిపారు.
also read:టీడీపీ-జనసేన తొలి జాబితా: 14 మంది మహిళలు, 23 మంది కొత్తవాళ్లకు చోటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరింది.ఈ రెండు పార్టీలు ఇవాళ 99 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. బీజేపీ కూడ ఈ కూటమిలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.ఈ విషయమై బీజేపీ నుండి స్పష్టత వచ్చిన తర్వాత మరో జాబితా విడుదల చేయనుంది తెలుగుదేశం పార్టీ.