ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని ప్రకాశం, విజయవాడల్లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం నాడు సోదాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని ఆలకూరపాడులో కళ్యాణరావు ఇంటితో పాటు మావోయిస్టు అగ్రనేత ఆర్ కే భార్య శిరీష ఇంట్లో కూడా తనిఖీలు చేశారు.
విజయవాడ: Andhra Pradesh రాష్ట్రంలోని ప్రకాశం, విజయవాడల్లో NIA సోదాలు నిర్వహించారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.
మంగళవారం నాడు ఉదయం మావోయిస్టు అగ్రనేత ఆర్ కే భార్య Sirisha నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆర్ కే బంధువు Kalyan Rao ఇంట్లో కూడా ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. ప్రకాశం జిల్లాలోని ఆలకూరపడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. గత ఏడాది ఏప్రిల్ 1 వ తేదీన శిరీష ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పుస్తకాలు, పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత Vijayawada లో విచారణకురావాలని నోటీసులు ఇచ్చారు. ఈ విషయమై శిరీష కోర్టును ఆశ్రయించారు.
undefined
అయితే గత ఏడాది నవంబర్ మాసంలో అనారోగ్య కారణాలతో మావోయిస్టు అగ్రనేత ఆర్ కే మరణించాడు. ఆర్ కే మరణించిన తర్వాత శిరీష నివాసంలో సోదాలు నిర్వహించారు. మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత శిరీష ఆలకూరపాడులోనే నివాసం ఉంటున్నారు. అనారోగ్య కారణాలతో శిరీష ప్రస్తుతం ఆలకూరపాడులో లేరు. ఆమె విజయవాడలో ఉంటున్నారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. శిరీష ఇంట్లో లేని సమయంలో ఎన్ఐఏ అధికారులు ఆమె ఇంట్లో పుస్తకాలు, పెన్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకొన్నారని సమాచారం.
మావోయిస్టులతో శిరీషకు సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. మరో వైపు విజయవాడ పట్టణంలోని సింగ్ నగర లో కూడా విరసం నేత దొడ్డి ప్రభాకర్ నివాసంలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. విరసం నేతలపై ఇటీవల విశాఖ జిల్లాలోని పెద్ద బయలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.