అంతుచిక్కని వ్యాధి: ఏలూరుకు రానున్న ఎన్‌హెచ్‌డీసీ బృందం

Published : Dec 07, 2020, 02:24 PM IST
అంతుచిక్కని వ్యాధి: ఏలూరుకు రానున్న ఎన్‌హెచ్‌డీసీ బృందం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై కేంద్ర బృందం ఆరా తీస్తోంది. రెండురోజులుగా వైద్య నిపుణులు పలు రకాల పరీక్షలు నిర్వహించినా కూడ ఈ వ్యాధి లక్షణాలను గుర్తించలేదు.  

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై కేంద్ర బృందం ఆరా తీస్తోంది. రెండురోజులుగా వైద్య నిపుణులు పలు రకాల పరీక్షలు నిర్వహించినా కూడ ఈ వ్యాధి లక్షణాలను గుర్తించలేదు.  

ఈ వ్యాధి లక్షణాలపై వైద్య నిపుణులు  ఇంకా నిర్ధారణకు రాలేదు. అసలు ఎందుకు ఈ వ్యాధికి ప్రజలు గురౌతున్నారనే విషయమై  స్పష్టత రాలేదు. దీంతో కేంద్రం నుండి బృందం ఏలూరుకు రానుంది. ఎన్‌హెచ్‌డీసీ నుండి ముగ్గురు ప్రతినిధుల బృందం ఏలూరుకు రానుంది.

ఏలూరులో ఈ వింత వ్యాధితో 341 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధికి గల కారణాలపై ఆరా తీసేందుకు గాను ఈ బృందం ప్రయత్నించనుంది.ఇప్పటివరకు వ్యాధి మూలాలను వైద్యులు తేల్చలేకపోయారు. ఈ వ్యాధితో ఇప్పటివరకు ఒకరు మరణించారు. ఈ వ్యాధితో అస్వస్థతకు గురైన వారిలో 168 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

also read:ఏలూరులో అంతుచిక్కని వ్యాధి : అంతా మామూలుగానే ఉంది కానీ.. కలెక్టర్‌ నివేదిక..

ఈ వ్యాధి విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. 341 మంది ఈ వ్యాధికి గురైనట్టుగా ఆయన ఆ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం 157 మంది బాధితులు ఈ వ్యాధితో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన ఆ నివేదికలో తెలిపారు.

బాధితులను సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య  సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu