ఏలూరులో అంతుచిక్కని వ్యాధి : అంతా మామూలుగానే ఉంది కానీ.. కలెక్టర్‌ నివేదిక..

By AN TeluguFirst Published Dec 7, 2020, 1:29 PM IST
Highlights

గత రెండు రోజులుగా ఏలూరులో కలకలం రేపుతున్న అస్వస్థతకు సంబంధించి వైద్య, సహాయ చర్యలు హుటాహుటిన జరుగుతున్నాయి. శనివారం నాడు ఏలూరులో వరుసగ పిల్లలు అస్వస్థతకు గురయ్యి, నోట్లో నురగలు కక్కుతూ.. స్పృహ కోల్పోయిన విషయం తెలిసిందే. అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుంతుండగా ఇప్పటివరకు ఒకరు మరణించారు.

గత రెండు రోజులుగా ఏలూరులో కలకలం రేపుతున్న అస్వస్థతకు సంబంధించి వైద్య, సహాయ చర్యలు హుటాహుటిన జరుగుతున్నాయి. శనివారం నాడు ఏలూరులో వరుసగ పిల్లలు అస్వస్థతకు గురయ్యి, నోట్లో నురగలు కక్కుతూ.. స్పృహ కోల్పోయిన విషయం తెలిసిందే. అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుంతుండగా ఇప్పటివరకు ఒకరు మరణించారు.

దీనిమీద జిల్లా కలెక్టర్‌ సమర్పించిన నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. 

మొత్తం అస్వస్థకు గురైనవారు – 340 
ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు – 157
మరణించిన వారు – 1
మెరుగైన చికిత్సకోసం తరలించిన వారు – 14
డిశ్చార్జి అయిన వారు –  168
ఏలూరు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 5 గురికి చికిత్స, వారు కూడా డిశ్చార్జి

అస్వస్థతకు గురైన వారిలో పురుషులు 180, మహిళలు 160

అస్వస్థతకు గురైనవారిలో ఏలూరు అర్బన్‌కు చెందినవారు – 307
ఏలూరు రూరల్‌కు చెందిన వారు – 30
దెందులూరు – 3

లక్షణాలు :

3 – 5 నిమిషాలపాటు మూర్ఛ
ఒక్కసారి మాత్రమే, రిపీట్‌కాలేదు
మతిమరుపు
ఆందోళన
వాంతులు
తలనొప్పి
వెన్నునొప్పి
నీరసం

– ఇప్పటివరకూ.. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదు
– తీవ్రత తక్కువగా ఉంది
– మూర్ఛఅనేది ఒకేసారి వస్తుంది.. మళ్లీ రిపీట్‌ కాలేదు.
– ఏలూరు మున్సిపల్‌ వాటర్‌ పంపిణీ లేని ప్రాంతాల్లోకూడా అస్వస్థతకు గురయ్యారు.
– ఒక ఇంటిలో ఒకరు లేదా ఇద్దకు అస్వస్థతకు గురయ్యారు. 
– ప్రత్యేకించి పలానా వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది లేదు.
– రోజూ మినరల్‌వాటర్‌ తాగే వాళ్లుకూడా అస్వస్థతకు గురయ్యారు. 

22 తాగునీటి శాంపిళ్లు పరీక్షించగా రిపోర్టులు సాధారణస్థితినే సూచించాయి.
52 రక్త నమూనాలను పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయి.
35 సెరిబ్రల్‌ స్పైనల్‌ ఫ్లూయిడ్‌ శాంపిళ్లను పరీక్షంగా సెల్‌ కౌంట్‌ నార్మల్‌ వచ్చింది. కల్చర్‌ రిపోర్టు రావాల్సి ఉంది.
45 మందికి సీటీ స్కాన్‌ చేశారు. నార్మల్‌గానే ఉంది.
9 పాల నమూనాలను స్వీకరించారు. అవికూడా ఫలితాలు సాధారణంగానే ఉన్నాయి.
సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ విశ్లేషణకోసం హైదరాబాద్‌ సీసీఎంబీకి 10 నమూనాలను పంపించారు. ఫలితం రావాల్సి ఉంది. 

ఇంటింటి సర్వే:

62 గ్రామ, వార్డు సచివాలయాలు సర్వేలో పాల్గొన్నాయి. 
57,863 కుటుంబాల్లో ఉన్నవారిపై ఆరోగ్య సర్వే చేశారు. 
కుటుంబ సర్వే ద్వారా 191 మంది అస్వస్థులను గుర్తించారు.
వీరందరినీ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బాధితులకు చికిత్స అందిస్తున్న స్పెషలిస్టులతో సహా 56 మంది డాక్టర్లు
మైక్రో బయాలజిస్ట్‌లు 3
నర్సులు 136 మంది, ఎఫ్‌ఎన్‌ఓలు 117, ఎంఎన్‌ఓలు 99

సేవలందిస్తున్న అంబులెన్స్‌లు 20
62 మెడికల్‌ క్యాంపుల నిర్వహణ
24 గంటలు మెడికల్‌క్యాంపులు నడిచాయి.
ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రి సహా నాలుగు ఆస్పత్రుల్లో 445 బెడ్లు అందుబాటులో.
రోగులకు మంచి పౌష్టికాహారం 

విజయవాడ జీజీహెచ్‌లో 50 బెడ్లు కేటాయింపు
12 మంది డాక్టర్లు, 4 అంబులెన్స్‌లు, 36 మంది నర్సింగ్‌ సిబ్బంది ద్వారా సేవలు.
విజయవాడకు ఇప్పటివరకూ 7గురు తరలింపు. అందరి పరిస్థితి స్థిరంగా ఉంది.

click me!