గుడికో గోమాత : కనకదుర్గమ్మ ఆలయంలో ప్రారంభం..

Published : Dec 07, 2020, 10:14 AM IST
గుడికో గోమాత : కనకదుర్గమ్మ ఆలయంలో ప్రారంభం..

సారాంశం

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రమణ దీక్షితులు, తిరుమల తిరుపతి సలహాదారులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వైవీసుబ్బారెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఆలయంలో ఒక గోవును కచ్చితంగా పూజించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నుంచి గోవులను తీసుకువచ్చి అమ్మవారికి ఇచ్చామని తెలిపారు. 

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పీఠాధిపతి ఆధ్వర్యంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలలో గోవులను అందిస్తామని చెప్పారు. భక్తులు గోవులను దానం చేయాలనుకునేవారు తిరుమల తిరుపతి దేవస్థానానికి గోవులను దానం చేయాలని కోరారు. గోవు సంరక్షణ పూర్తి బాధ్యత కు నిమిత్తం ఆలయ అధికారులే వహిస్తారని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు గోవులను పెంచాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. దాతలు కూడా ముందుకు వచ్చి టీటీడీ, హిందు ప్రచార పరిషత్‌కి గోవులను అందజేయాలని పిలుపునిచ్చారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Respect Towards Vijay | CM VIjay At Vijayawada | Asianet News Telugu
నే అడుగెడితే.. షో మొదలెడితే | CM Vijay And CM Chandrababu Visuals | Asianet News Telugu