పోతిరెడ్డిపాడు: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ కీలక ఆదేశం

Published : Dec 21, 2020, 05:03 PM IST
పోతిరెడ్డిపాడు: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ కీలక ఆదేశం

సారాంశం

పోతిరెడ్డిపాడుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.  

న్యూఢిల్లీ: పోతిరెడ్డిపాడుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

పోతిరెడ్డిపాడుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ ముగిసింది.  డీపీఆర్ తయారీ కోసం ప్రాథమిక పనులను మాత్రమే చేపడుతున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

భూసార పరీక్షలు, జియోలాజికల్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది వెంకటరమణి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చింది. 

also read:జగన్‌ సర్కార్‌కి షాక్: పోతిరెడ్డిపాడుపై ఎన్జీటీ కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వ వాదనతో పిటిషనర్ మాత్రం ఏకీభవించలేదు.  పనులు వేగవంతంగా సాగుతున్నాయని  పిటిసనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.  దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను  పిటిషనర్ తరపు న్యాయవాది గ్రీన్ ట్రిబ్యునల్ కు అందించారు. ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత పోతిరెడ్డిపాడు పనుల ప్రస్తుత పరిస్థితిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ  ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. 

ఈ కేసు విచారణను జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమాధానంపై తృప్తి చెందకపోతే పరిశీలన కమిటీని పంపుతామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు