విశాఖలో హవాలా మనీ కలకలం: కోటి నగదు, వెండి స్వాధీనం

By narsimha lodeFirst Published Dec 21, 2020, 3:14 PM IST
Highlights

విశాఖపట్టణంలో  రాజస్థాన్ కి చెందిన ఇద్దరి నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు కోటి రూపాయాల నగదు, 20 కిలోల వెండిని స్వాధీనం చేసుకొన్నారు.

విశాఖపట్టణంలో  రాజస్థాన్ కి చెందిన ఇద్దరి నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు కోటి రూపాయాల నగదు, 20 కిలోల వెండిని స్వాధీనం చేసుకొన్నారు.విశాఖపట్టణంలోని రైల్వేస్టేషన్ కు సమీపంలోని రెండు హోటల్స్ లో ఇద్దరు నిందితుల నుండి ఈ నగదును స్వాధీనం చేసుకొన్నారు.  

విశాఖ రైల్వేస్టేషన్ ను అడ్డాగా చేసుకొని హావాలా మనీని మార్పిడి చేస్తున్నారని  పోలీసులు గుర్తించారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

 

విశాఖపట్టణంలో కోటి రూపాయాల నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం నాడు స్వాధీనం చేసుకొన్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి కోటి రూపాయాల నగదు, వెండి, గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు.

— Asianetnews Telugu (@AsianetNewsTL)

హోటల్స్ ను అడ్డగా చేసుకొని నిందితులు హావాలా మనీని మారుస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.బిల్లులు లేని నగదును రాజస్థాన్ కు చెందిన ఇద్దరి నుండి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. విశాఖపట్టణంలోని పలు హోటల్స్ లో ఇంకా కొందరు హవాలా డబ్బును మార్పిడి చేస్తున్నారని  పోలీసులు విచారణ చేస్తున్నారు. 

click me!