రూ. 50 కోట్లు డిపాజిట్ చేయండి: ఎల్జీ పాలిమర్స్ కు ఎన్జీటి నోటీసులు

By telugu teamFirst Published May 8, 2020, 1:08 PM IST
Highlights

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనపై నేషనల్ గ్రీిన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా ప్రతిస్పందించింది. ఎల్జీ పాలిమర్స్ కు ఎన్దీటీ నోటీసులు జారీ చేసింది. స్థానిక కోర్టులు రూ. 50 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

విశాఖపట్నం: విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్టీటీ) తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి, ఎల్జీ పాలిమర్స్ కు, పీసీబీకి ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. స్థానిక కోర్టులో 50 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. గ్యాస్ లీక్ దుర్ఘటన వల్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని అభిప్రాయపడింది.

ఇదిలావుంటే, ఎల్జీ పాలీమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుతమైతే గ్యాస్ లీకేజీ లేదని ఆయన చెప్పారు. ఆయన శుక్రవారం ఎల్జదీ పాలీమర్స్ ను సందర్శించారు. గ్యాస్ ను నెమ్మదిగా నియంత్రణలోకి తేవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

కెమికల్ గ్యాస్ ట్యాంక్ పేలే అవకాశం లేదని ఆయన చెప్పారు. గ్యాస్ వ్యాపర్ రేపు ఉదయానికల్లా నియంత్రణలోకి వస్తుందని సాంకేతిక నిపుణులు చెప్పినట్లు ఆయన తెలిపారు. గ్యాస్ లీకేజీపై భయాందోళనలు అవసరం లేదని ఆయన అన్నారు. గుజరాత్, పూణే నిపుణులు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక నిపుణులతో టచ్ ఉన్నట్లు అవంతి తెలిపారు.

విశాఖపట్నం, ఎల్జీ పాలిమర్స్ లో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో మళ్లీ గ్యాస్ లీక్ అవుతుండడంతో గ్రామ ప్రజలందర్నీ ఇళ్లల్లో నుంచి పోలీసులు ఖాళీ చేయించారు. ఉదయం జరిగిన గ్యాస్ లీక్ తరువాత ఊళ్లు ఖాలీ చేసి వెళ్లిపోయిన ప్రజలు కాస్త సద్దుమనగడంతో సాయంత్రం అనేక మంది ఎవరిళ్లకు వాళ్లు చేరిపోయారు. అయితే రాత్రి మళ్లీ గ్యాస్ లీక్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

పోలీసు కమిషనర్ ఆర్ కె.మీనా, డీసీపీ -2 ఉదయ్ భాస్కర్ హుటా హుటన ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి చేరిపోయారు. ఫ్యాక్టరీకి 200 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఖాలీ చేయించే ఏర్పాట్లు చేశారు. గ్యాస్ లీక్ కొనసాగుతుండడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేమని అధికారులు అంటున్నారు. 

అందువల్లే ముందస్తు చర్యగా ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న నివాసితులను ఖాలీ చేయించడానికి అధికారులు నిర్ణయించారు. ఈ గ్యాస్ లీక్ ఎంత స్థాయిలో ఉంటుంది అనే విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా చెప్పలేకపోతోంది. 

దీని కోసం నాగపూర్ నుంచి ప్రత్యేక విమానంలో నిపుణులను తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదిఏమైనా ఈ రాత్రంతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివాసాలు ఖాలీ చేసే విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

click me!