రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఎక్కువమంది చూసే మూడు దిన పత్రికలు ఈ రోజు తమ మెయిన్ ఎడిషన్స్ ను ఎలాంటివార్తలతో పొందుపరిచాయో సమగ్ర కథనం.
టిడిపి నేత బీటెక్ రవి అరెస్ట్..
వైయస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని పోలీసులు మంగళవారం రాత్రి చిన్న గొడవ విషయంలో అరెస్టు చేశారు. ఆయనను జడ్జి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. జనవరిలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కోసం కడపకు వచ్చినప్పుడు జరిగిన గొడవ విషయంలో బీటెక్ రవిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి అరెస్ట్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ టిడిపి శ్రేణులు విమర్శిస్తున్నాయlని ఈనాడు ప్రచురించింది.
అరాచక శక్తికి.. అధికారం తోడైతే..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ మూకల దాడుల మీద ఓ ప్రత్యేక కథనం ఈనాడు ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్లో బాలికలు వృద్ధుల పైన దాడులు చేస్తున్నారని.. దాష్టీకాలు, దౌర్జన్యాలతో అధికార పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారని ఈ కథనంలో తెలిపింది. అయితే, పోలీసులు మాత్రం వీరిని ఏమీ అనకుండా నేర చరిత్ర జోలికి పోకుండా మానవ్రతం వహిస్తున్నారంటూ వివరనాత్మక కథనం ప్రచురించింది.
వాలంటీర్లతో కులగణన
బుధవారం నుంచి రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్లో కులగణన ప్రక్రియ పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించబోతున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఐదు సచివాలయాలను ఎంపిక చేశారు. ఈ కులగణన ప్రక్రియలో రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులకు సంబంధించిన వివరాలను పొందుపరచనున్నారు. పూర్తి వార్తకు సంబంధించిన లింకు ఇది…
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం...
21 బీసీ కులాలకు భౌగోళిక పరిమితులు రద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 21 బీసీ కులాలు ఉప కులాలకు ఉన్న భౌగోళిక పరిమితులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శెట్టి బలిజలను గ్రేటర్ రాయలసీమలో బీసీలుగా పరిగణించకూడదు అంటూ ఉత్తర్వులు జారీ చేసిందని ఈనాడు చెప్పింది.
సహారా గ్రూప్ వ్యవస్థాపకులు సుబ్రతా రాయ్ కన్నుమూత
సహారా గ్రూప్ వ్యవస్థాపకులు చైర్మన్ శుభ్రత రాయ్ 75 ఇక లేరు. మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయన చాలాకాలంగా మెటల్ స్టాటిక్ కేన్సర్, హైబీపీ, మధుమేహంతో బాధపడుతున్నారు. పూర్తి వార్త లింక్ ఇది...
Subrata Roy: సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్స్ నేడు జరగనుంది.. దీనికి సంబంధించిన ఒక వార్తను జయాపజయాల అనాలిసిస్ కింద మొదటి పేజీలో కివిస్ కాచుకో అంటూ… ప్రముఖంగా ప్రచురించారు.
టాస్ కాదు, మ్యాచ్‌ని డిసైడ్ చేసేది మొదటి 10 ఓవర్లే! ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌పై...
గాజా మరుభూమి
గాజాలో నానాటికి దిగజారిపోతున్న పరిస్థితుల మీద సాక్షి ప్రత్యేక కథనం.. ఆసుపత్రుల్లో రోగులు దయనీయ పరిస్థితుల గురించి కథనాన్ని ప్రచురించింది. అల్ షిషాలో 179 మృతదేహాలు ఖననం చేశారు. ఆస్పత్రిలో తీవ్ర అపరిశుభ్రతతో ప్రాణాంతక రోగాలు వ్యాపిస్తున్నాయి. కరెంటు తదితర సదుపాయాలతో పాటు నిత్యావసరాలన్నీ నిండుకోవడంతో ఆసుపత్రులన్నీ మృతి దిబ్బలుగా మారుతున్నాయి. అల్సిఫా ఆసుపత్రిని దక్షిణమే విడిచిపోవాలన్న ఇజ్రాయిల్ ఆదేశాలను వైద్య సిబ్బంది మంగళవారం కూడా తిరస్కరించారు 700 మందికిపైగా ఉన్న రోగులను వదిలేసి వెళ్లలేమని తిరస్కరించారు. హమామ అల్లో అనే నెఫ్రాలజిస్ట్ పోవడానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.
రాయేదో… రత్నమేదో తేల్చుకోండి
తొర్రూరు సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గురించి ఒకసారి ఊళ్ళల్లో చర్చ పెట్టండి. అధికారం ఇచ్చినప్పుడు ఎవరు ఏం చేశారు ఆలోచించి ఓటు వేయండి అంటూ ఆయన మాట్లాడారు.
రాజకీయ పర్యాటకులతో జాగ్రత్త : కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ విమర్శలు
కాంగ్రెస్లో రె‘బెల్స్’
రాష్ట్రవ్యాప్తంగా 24చోట్ల కాంగ్రెస్ అసంతృప్తులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అసంతృప్తులతో ఠాక్రే చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు బుధవారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీనిమీద గాంధీ భవన్ వర్గాలు పది చోట్ల రెబెల్స్ విడత తప్పక పోవచ్చని అనుమానిస్తున్నట్లు ఈ కథనంలో తెలిపింది. దీంతోపాటు సూర్యాపేట, వరంగల్ వెస్ట్, బాన్సువాడ, జుక్కల్, డోర్నకల్ స్థానాల మీద కాంగ్రెస్లో ఉత్కంఠ ఉందని ప్రచురించింది.
Telangana Assembly Elections 2023: మూడు ప్రధాన పార్టీలకు రెబల్ కష్టాలు.. ఎవరిని దెబ్బకొట్టేనో.?
రాబోయే వ్యాధులకు ముందే చెక్..
మానవ కణజాల నిల్వ, విశ్లేషణ కోసం హైదరాబాదులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యధునిక బయో బ్యాంకును ఏజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త డాక్టర్ ఈ బయో బ్యాంకుకును మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలుతో ఒక కథనాన్ని ప్రచురించింది.
మొత్తం ఓటర్లు 3.26 కోట్లు
తెలంగాణలో మొత్తం ఓటర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనం తెలిపింది. మంగళవారం నాడు తెలంగాణలోని ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. గత నెల ఐదున ప్రకటించిన జాబితాతో పోలిస్తే ఐదో తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు కొత్తగా 8, 70, 072 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విడుదల చేసిన జాబితా ప్రకారం 3, 26,02,799 మంది ఓటర్లు ఉన్నారు.
బకాయిలు సకరాలంలో చెల్లించకపోవడంతో 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య..
ఆంధ్రప్రదేశ్ లో బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. 2000 మంది కాంట్రాక్టర్లకు 20వేల కోట్ల బకాయిలు బాకీ పడ్డారు. వీటిని సకాలంలో చెల్లించకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆర్ అండ్ బి లో అత్యధికంగా రూ.1500 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది.
హెచ్పీ మోటర్లు వాడి తాత కొనిస్తాడా… రేవంత్ రెడ్డి పై కేసీఆర్ ఫైర్..
కెసిఆర్ మంగళవారం నాడు హాలియా, తొర్రూరు, ఇబ్రహీంపట్నంలో సభలు నిర్వహించారు. ఈ సభల్లో మాట్లాడుతూ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలల్లో ఏం జరిగింది పదేళ్ల మా పాలనను ఏం చేసామో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. 24 గంటల విద్యుత్తు సాగునీటితో భూములు కళకళ లాడుతున్నాయని చెప్పారు. నల్లగొండ బిడ్డలకు రోషం ఉంటే కాంగ్రెస్కు ఓటేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు. నలగొండలోనే నలుగురు సీఎం అభ్యర్థులు ఉన్నారని.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎగిరేగి పడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
దండుపాళ్యం ముఠాను తరిమి కొట్టాలి
తెలంగాణలోని స్టేషన్గన్పూర్ లో మంగళవారం నాడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. కెసిఆర్ పాపం పండిందని చెప్పుకొచ్చారు. ప్రజలు ఆశించిన తెలంగాణ, తాము ఊహించిన తెలంగాణ ఇది కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద విరుచుకుపడ్డారు. ప్రజల్ని నట్టేట ముంచి దోచుకున్న దండుపాళ్యం ముఠా టిఆర్ఎస్ ప్రభుత్వం ముఠా అని.. పొలిమేర దాటేదాకా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ చేతుల్లో తెలంగాణ బందీ అయింది.. బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఫైర్
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి విద్యుత్ చౌర్యం
కర్నాటక మాజీ సీఎం మీద ఓ ఇంట్లో దీపావళి లైటింగ్ కు విద్యుత్ స్తంబం నుంచి విద్యుత్తును చోరీ చేశారని కాంగ్రెస్ విరుచుకుపడడంతో కుమారస్వామి జరిమానా చెల్లిస్తానని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వార్తను చిన్నగా ప్రచురించింది.