
పెళ్లైనా 10 నెలలకే ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వరకట్న వేధింపులకు ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా పామర్రులో చోటుచేసుకుంది. వివరాలు.. అమ్యూల్య, ప్రసంగి బాబులకు గతేడాది వివాహం జరిగింది. అయితే పెళ్లైనా పది నెలలకే అమూల్య మరణించడం ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర విషాదం నింపింది.
పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే అత్తింటి వారు అమ్యూల్యను వరకట్నం గురించి వేధించడం మొదలు పెట్టారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. శుక్రవారమే అమ్యూల్యను హత్య చేసిన ప్రసంగి బాబు పారిపోయాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని చెబుతున్నారు. అందుకే ఇంటి నుంచి పారిపోయాడని తెలిపారు. అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించిన పోలీసులు.. మృతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.