పెళ్ళైన నాలుగు నెలలకే నవదంపతుల సూసైడ్ , ఎందుకంటే?

Published : Jun 04, 2018, 01:24 PM IST
పెళ్ళైన నాలుగు నెలలకే నవదంపతుల సూసైడ్ ,   ఎందుకంటే?

సారాంశం

పెళ్ళైన నాలుగు నెలలకే నవ దంపతుత సూసైడ్

ఏలూరు: పెళ్ళైన నాలుగు మాసాలకే భార్య, భర్తలు
ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా
రామన్నగూడెంలో చోటు చేసుకొంది.

పశ్చిమగోదావరి జిల్లాలోని రొయ్యలగూడెం మండలం
చొప్పనరామన్నగూడెంలో ఆదివారం రాత్రి నవదంపతులు
ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 విజయరాజు, ప్రియాంకలకు  నాలుగు నెలల క్రితం
వివాహమైంది. ఈ క్రమంలో కాపురం  ఎక్కడ పెట్టాలనే
అంశంలో దంపతులు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కూడా భార్య భర్తల మధ్య
చర్చ జరిగింది. హైదారాబాద్‌లో కాపురం పెట్టాలని
ప్రియాంక, చొప్పనరామన్నగూడెంలోనే ఉండాలని
విజయరాజు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. 

ఈ గొడవ కారణంగా అర్దరాత్రి పూట ప్రియాంక ఫ్యాన్ కు
ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక సూసైడ్
చేసుకొన్న విషయాన్ని గుర్తించిన విజయరాజు కూడ
ఆత్మహత్య చేసుకొన్నారు.

చిన్న విషయానికే భార్య,భర్తలు ఆత్మహత్యకు పాల్పడడం
ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

 

PREV
click me!

Recommended Stories

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!