విజయనగరంలో విషాదం: ఇంట్లో భార్య, తోటలో భర్త... ఉరేసుకుని నవదంపతుల ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Oct 31, 2021, 10:41 AM ISTUpdated : Oct 31, 2021, 10:57 AM IST
విజయనగరంలో విషాదం: ఇంట్లో భార్య, తోటలో భర్త... ఉరేసుకుని నవదంపతుల ఆత్మహత్య

సారాంశం

నవ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విజయనగరం జిల్లా చీపురువలసలో చోటుచేసుకుంది. 

విజయనగరం: కొత్తగా వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన నవ దంపతులు ఒకేరోజు వేరువేరుగా ఆత్మహత్య చేసుకున్న విషాదం విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. భార్య ఇంట్లో, భర్త మామిడితోటలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.  

పోలీసులు, భాదిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. vijayanagaram district చీపురువలసకు చెందిన రాము(25) కు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన వెంకటదుర్గాహేమ(23) తో ఈ ఏడాదే జూలై 1న వివాహమయ్యింది. పెళ్ళయిన ఈ నాలుగు నెలలుగా వీరి కాపురం ఆనందంగా సాగింది. 

అయితే కారణమేంటో తెలీదు కాని శనివారం రాము ఆపీసుకు వెళ్లిపోయిన తర్వాత హేమ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి మేడపై గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు కొనఊపిరితో వున్న ఆమెను హాస్పిటల్ కు తరలించినా ఫలితంలేకుండా పోయింది. మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది.  

భార్య హేమ suicide చేసుకున్నట్లు తెలిసి రాము కూడా దారుణ నిర్ణయం తీసుకున్నాడు. గ్రామ సమీపంలోని ఓ మామిడితోటలోకి వెళ్లిన అతడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా పెళ్లయిన నాలుగు నెలలకే భార్యాభర్తలిద్దరు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. 

read more  హైదరాబాద్: కేవలం వంద రూపాయల కోసం... చిన్నారి ప్రాణాలు బలితీసుకున్న వైద్యసిబ్బంది

భార్యాభర్తల మధ్య మనస్పర్దలు తలెత్తడం వల్లే ఈ ఆత్మహత్యలు చోటుచేసుకుని వుంటాయని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఒకేసారి ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో అటు అబ్బాయి ఇంట్లో, ఇటు అమ్మాయి ఇంట్లోను విషాదం నెలకొంది. 

ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి వుంది. 

ఇదిలావుంటే భర్తకు వీడియో కాల్ చేసిన భార్య లైవ్లో ఉరేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది. ఉపాధినిమిత్తం మదనపల్లికి వలసవచ్చిన చక్రి నాయక్,  కమలమ్మ దంపతుల ఒక్కగానొక్క కూతురు రమ్యశ్రీ (24). కూతురికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన చందు నాయక్ తో విహహం చేసారు తల్లిదండ్రులు. అయితే ఓ పాప పుట్టిన తర్వాత భార్యభర్తల మద్య కలహాలు మొదలయ్యాయి. దీంతో తన 11నెలల  కూతురితో కలిసి రమ్యశ్రీ తల్లిదండ్రుల వద్దే వుంటోంది. 

read more శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. కారు టైరు పేలి, నలుగురు దుర్మరణం

అయితే తనను కాపురానికి తీసుకెళ్లాలని రమ్యశ్రీ కొద్దిరోజులుగా భర్తను ఫోన్ చేసి అడుగుతోంది. అయినా చందు నాయక్ స్పందించడంలేదు. ఇలా రమ్యశ్రీ శుక్రవారం భర్తకు video call చేసి కాపురానికి తీసుకెళ్లాలని కోరింది. అయితే భర్త ఏ విషయం చెప్పకపోవడంతో వీడియో కాల్ కొనసాగిస్తూనే చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. దీంతో చందు వెంటనే అత్త కమలమ్మ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాగా ఇళ్లల్లో పనులు చేసేందుకు వెళ్లిన ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకోగా కూతురు ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.   

స్థానికులు వచ్చి రమ్యశ్రీని కిందికి దించి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అల్లుడు వేధింపుల కారణంగానే తన బిడ్డ suicide చేసుకుందని రమ్యశ్రీ తల్లి పోలీసులకు చెప్పింది.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం