విజయవాడ: చిన్నారి హత్య కేసులో అత్యాచారం కోణం.. మెడపై గోళ్లతో రక్కిన గుర్తులు

By sivanagaprasad Kodati  |  First Published Nov 11, 2019, 9:05 PM IST

విజయవాడ భవానీపురంలో సంచలనం సృష్టించిన చిన్నారి ద్వారక హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. బాలికపై నిందితుడు ప్రకాశ్ అత్యాచారం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


విజయవాడ భవానీపురంలో సంచలనం సృష్టించిన చిన్నారి ద్వారక హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. బాలికపై నిందితుడు ప్రకాశ్ అత్యాచారం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

పాప మెడమీద గోళ్లతో రక్కినట్లు ఉన్న గాయాలను క్లూస్‌టీం గుర్తించింది. ప్రకాశ్ గతంలోనూ ఓ బాలికపై ప్రకాశ్ అత్యాచారయత్నం చేశాడని.. అలాగే అత్యాచారం కేసులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Latest Videos

నిన్న మధ్యాహ్నమే పాపను చంపిన ప్రకాశ్.. ఏం ఎరగనట్లు ద్వారక తండ్రితో పాటు గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. ద్వారక ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read:ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్య: పక్కింటి వ్యక్తే నిందితుడు..పట్టించిన భార్య

చిన్నారి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం తెలిసినవారిని విచారించారు. ప్రతి ఆదివారం సెలవు కావడంతో దగ్గరలోని నాయనమ్మ ఇంటికి వెళ్లి చిన్నారి ఆడుకుని వచ్చేదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.

అయితే సమయం గడిచేకొద్ది దీని వెనుక కిడ్నాప్ కోణం ఉందని పోలీసులు భావించారు. దీనిలో భాగంగా సోమవారం డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌ సాయంతో పాప ఆచూకీ కోసం గాలించడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

ఈ క్రమంలో ద్వారక ఇంటిపక్కన నివసిస్తున్న మేకల ప్రకాశ్ ప్రవర్తన స్థానికులకు, పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. అటు తన భర్తపై అనుమానంతో ప్రకాశ్ భార్య ఇంట్లో ఉన్న గోనెసంచెను చింపగా అందులో బాలిక మృతదేహం బయటపడింది.

Also Read:చిత్తూరు బాలికపై అత్యాచారం, హత్య... మహిళా కమీషన్ ఛైర్మన్ ఏమన్నారంటే

వెంటనే ఆమె ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడు ప్రకాశ్‌కు దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ద్వారకను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి పాప ఆచూకీ కోసం ఆమె తల్లీదండ్రులతో కలిసి ప్రకాశ్ గాలింపు చర్యల్లో పాల్గొన్నట్లు నటించాడు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

click me!