
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ సిరీస్ రానుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుని ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింద. దీని ప్రకారం.. ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ అనే కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు. ఇందుకోసం మోటారు వాహనాల చట్టంలోనూ సవరణ చేయనుంది ప్రభుత్వం. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు 40జీ సిరీస్ నెంబర్‌ను కేటాయించనున్నారు. 2018 చివరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ వాహనాలకు రవాణా శాఖ 39 సిరీస్‌ను జారీ చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలను వేరు చేసేలా 40జీ సిరీస్‌ను తీసుకొచ్చారు. దీనిపై అభ్యంతరాలు, సలహాలను రవాణా శాఖ కోరుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.