రివ్యూ రూమ్‌లో మారిన లోగో.... జగన్ వెనుక ఇది గమనించారా?

By Siva KodatiFirst Published Apr 15, 2020, 5:29 PM IST
Highlights
ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించే గదిలో స్వల్ప మార్పులు చేశారు జగన్. గతంలో జగన్ అధికారులతో రివ్యూ నిర్వహించే సమయంలో ఓ పెద్ద చక్రం ఆకారాన్ని పోలి వుండే డిజైన్ ఉండేది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఆనవాళ్లను ఒక్కొక్కటిగా చేరిపేస్తూ వస్తున్నారు. గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది.

తాజాగా ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించే గదిలో స్వల్ప మార్పులు చేశారు జగన్. గతంలో జగన్ అధికారులతో రివ్యూ నిర్వహించే సమయంలో ఓ పెద్ద చక్రం ఆకారాన్ని పోలి వుండే డిజైన్ ఉండేది.

నిన్న మొన్నటి వరకు అదే కొనసాగించారు కూడా. అయితే ఉన్నపళంగా ఆ చక్రం స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్ర ఉన్న లోగో ప్రత్యక్షమైంది.

బుధవారం కరోనాపై సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కుర్చీ వెనుక పెద్ద చక్రం లేకుండా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

పాత డిజైన్‌ను తీసి రాష్ట్ర ప్రభుత్వ లోగోను అక్కడ ఏర్పాటు చేశారా..? లేక ఇదేమైనా కొత్త సెంటిమెంటా అనే చర్చ మొదలైంది. అయితే సీఎం కార్యాలయాల్లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు సహజమని.. ఇందులో పెద్ద విశేషమేమి లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

సమీక్షా సమావేశం సందర్భంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కుటుంబ సర్వే గుర్తించిన సుమారు 32 వేల మందికి కూడా పరీక్షలు చేయాలని సూచించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలన్నారు.

క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి... ప్రతిరోజూ ప్రతి మనిషికి భోజనం, బెడ్‌కోసం, దుప్పటి కోసం రూ.500.. ప్రతిరోజూ ప్రతిమనిషికి రూ. 50లు పారిశుద్ధ్యం కోసం, ఇతరత్రా ఖర్చులకోసం రోజుకు రూ.50లు, ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్‌ సెంటర్‌కు రూ.300లు, తిరుగు ప్రయాణంకోసం కూడా మరో రూ.300లు ఖర్చు చేస్తున్నట్టుగా వెల్లడించిన అధికారులు తెలిపారు.

క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ప్రోటోకాల్‌ పూర్తిచేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు బీదలకు కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలని జగన్ ఆదేశించారు. 
click me!