ఉగాది నుండి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. సోమవారం నాడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు.
అమరావతి: ugadi నుండి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుందని ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. వీకేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ది సాగుతుందని ఆయన చెప్పారు.
సోమవారం నాడు Andhra Pradesh Budget సమావేశాలను ఏపీ గవర్నర్ Biswabhusan Harichandanప్రారంభించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగం ప్రారంబించగానే రాజ్యాంగాన్ని కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ TDP ప్రజా ప్రతినిధులు నినాదాలు చేశారు.Governor ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు.
గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కౄషి చేస్తోందని గవర్నర్ చెప్పారు.కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తుందని గవర్నర్ చెప్పారు. విద్య,వైద్యం, వ్యవసాయ రంగాల్లో మైరుగైన అభివృద్దిని సాధించామన్నారు. Coronaతో దేశం, రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పాలనను కిందిస్థాయి వరకు వర్తింపసేసేలా గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయని గవర్నర్ చెప్పారు.
ప్రభుత్వానికి ఉద్యోగులను మూల స్థంభాలుగా తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. అందుకే ఉద్యోగుల వయో పరిమితిని 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచామని గవర్నర్ చెప్పారు.
2020-21 నుండి మన బడి నాడు నేడు కింద ప్రభుత్వ స్కూల్స్ ను అభివృద్ది చేస్తున్నామని గవర్నర్ గుర్తు చేశారు. అమ్మఒడి పథకం కింద 44.5 లక్షల మంది తల్లులకు రూ. 13023 కోట్లు ఖర్చు చేశామని గవర్నర్ గుర్తు చేశారు.
పార్లమెంటరీ నియోజకవర్గానికి కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్టుగా గవర్నర్ వివరించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని గవర్నర్ తెలిపారు. 2021-22 లో రూ. 9091 కోట్లతో రైతులకు ప్రయోజనం చేకూర్చామన్నారు రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13,500 చొప్పున ఆర్ధిక సహాయం అందించామన్నారు. ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు రూ., 20,162 కోట్ల సహాయం అందించామని గవర్నర్ తెలిపారు.
వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ. 81,703 మంది లబ్దిదారులకు రూ.,577 కోట్ల సహాయం అందించామని గవర్నర్ తెలిపారు.జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రహ్మణులకు రూ., 583 కోట్ల సహాయం అందించిన విషయాన్ని గవర్నర్ వివరించారు.స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 12758 కోట్లు అందించామన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ., 2354 కోట్లు అందించిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుండి 60 ఏళ్ల మహిళలకు 9100 కోట్లు అందించామని గవర్నర్ తెలిపారు.