వైరల్ అవుతున్న త్రిశూల అభిషేకం ఫొటోలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు..

Published : Mar 07, 2022, 09:18 AM IST
వైరల్ అవుతున్న త్రిశూల అభిషేకం ఫొటోలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు..

సారాంశం

ఆచారాలు, సంప్రదాయాలు విచ్చిన్నం చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇష్టానుసారం వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. ఇలాంటి ఓ వివాదాస్పద ఘటన శ్రీకాళహస్తి ఆలయంలో చోటు చేసుకుంది. దీంతో ఇప్పుడీ ఘటన పలు విమర్శలకు దారి తీస్తోంది. వివరాల్లోకి వెడితే.. 

శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా Srikalahastishwara Templeలో ఆదివారం జరిగిన అభిషేకం క్రతువులో రాజకీయ నేతలు Trishulamన్ని స్పృశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. Mahashivaratri ఉత్సవాల్లో సూర్య పుష్కరిణి వద్ద త్రిశూలాన్ని అభిషేకించడం ఆనవాయితీ. అనువంశిక ప్రధానార్చకులు డాక్టర్ స్వామినాథన్ gurukul త్రిశూలం చేతపట్టగా, అర్చకులు అభిషేక జలం ఆయన శిరస్సుపై పోశారు.

ఆ తర్వాత త్రిశూలాన్ని ఇతరులెవరూ స్పృశించకూడదు. కానీ, ప్రధాన అర్చకుడిని అనుసరిస్తూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు, ఈవో పెద్దిరాజు దంపతులు,  చైర్మన్ అంజూరు శ్రీనివాసులు త్రిశూలాన్ని చేతబట్టి అభిషేకించు కున్నారు.  అంతేకాకుండా ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై పలువురు పెద్ద ఎత్తున అభ్యంతరాలు  వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్| Asianet News Telugu
Botsa Satyanarayana Pressmeet: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ సెటైర్లు | Asianet Telugu