శ్రీకాకుళంలో విషాదం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి..వివాహిత ఆత్మహత్య..

Published : Mar 07, 2022, 06:46 AM ISTUpdated : Mar 07, 2022, 06:47 AM IST
శ్రీకాకుళంలో విషాదం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి..వివాహిత ఆత్మహత్య..

సారాంశం

వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, వేధింపులు మహిళలు బలవన్మరణానికి పాల్పడేలా చేస్తున్నాయి. అయితే పిల్లలను కూడా చంపి, చనిపోవడం ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది. ఇలాంటి ఘటనలు వారానికొకటి జరగడం విస్మయం కలిగించే విషయం.. తాజాగా శ్రీకాకుళంలో ఓ తల్లి ఇద్దరు పిల్లలను చంపి తానూ ఉరివేసుకుంది.

శ్రీకాకుళం : భార్యభర్తల మధ్య జరిగిన తగాదా మూడు నిండు ప్రాణాలను బలిగొంది.Husband harassment భరించలేక ఓ మహిళ ఉరివేసుకుని suicideకి పాల్పడింది. తాను చనిపోతే Children ఏమైపోతారో అనే ఆందోళనతో వారిద్దరిని కూడా చంపేసింది. ఈ ఘటన Srikakulam నగరం దమ్మలవీధిలో నివాసం ఉంటున్న ధనలక్ష్మి (27)కి గార మండలం పేర్లవానిపేటకు చెందిన లక్ష్మీనారాయణతో పన్నెండేళ్ళ కిందట వివాహమయ్యింది. అయిదేళ్ల పాటు కాపురం చక్కగానే సాగింది. ఆ తర్వాత వేధింపులు ఎక్కువ కావడంతో ధనలక్ష్మి ఇద్దరు పిల్లలు సోనియా (11), యశ్వంత్ (9)తో కలిసి ఏడేళ్ల కిందట తండ్రి మైలపల్లి ఎర్రయ్య ఇంటికి వచ్చేసింది.

కాకినాడలో షిప్ లో పనిచేసే లక్ష్మీనారాయణ అప్పుడప్పుడు వచ్చి వీరిని చూసి వెళుతూ వుండేవాడు. అప్పుడు కూడా ఇద్దరి మధ్య తగాదాలు జరుగుతుండేవి. ఏడాది నుంచి ఒక్కసారి కూడా భార్య, పిల్లలను చూసేందుకు రాలేదు. ఆదివారంనాడు ధనలక్ష్మి భర్తతో ఫోన్లో మాట్లాడింది. వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో.. ఏమో కానీ  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇతర పిల్లలతో పాటు తాను ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందింది.

ఎంత చెప్పినా వినలేదు..
ధనలక్ష్మి తండ్రి మైలపల్లి ఎర్రయ్య ఆర్టీసీ డ్రైవర్ గా పని చేసి ఉద్యోగ విరమణ పొందాడు. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ గా వెళ్తున్నాడు. ఆయన భార్య సీతమ్మ రోజు ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకునేది. ఆదివారం ఆమె వత్సవలస జాతరకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరు ఈ సమయంలోనే ధనలక్ష్మి అఘాయిత్యానికి పాల్పడింది.. భర్తను చూడడానికి రావట్లేదని పిల్లలతో సహా ఏదో చేసుకుంటానని ధనలక్ష్మి అంటూ ఉండేదని, మేము నీకు అండగా ఉంటాం.. అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు.. అంటూ ఎంత చెప్పినా వినలేదని ఎర్రయ్య బోరున విలపించారు.  

ముగ్గురు వేర్వేరు గదుల్లో ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. శ్రీకాకుళం డి.ఎస్.పి  మహేంద్ర, ఒకటో పట్టణ సీఐ అంబేద్కర్, ఎస్ఐ విజయ్ కుమార్, ప్రవళిక ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యర్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, మార్చి 5న కర్నూలులో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. kurnool మండలం పూలతోటలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలోకి దూకింది. గమనించిన స్థానికులు వెంటనే ముగ్గురిని కాపాడేందుకు యత్నించారు. కాగా ఇద్దరు పిల్లలు అప్పటికే మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. family disputesయే ఘటనకు కారణమని బంధువులు చెబుతున్నారు. ఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో వేర్వేరు తేదీల్లో రెండు చోట్ల ఇలాంటి ఘటనలే జరిగాయి. ఫిబ్రవరి 14న belagaviలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ, ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా.. భర్త, అత్తమామలను అరెస్ట్ చేసేంతవరకు అంత్యక్రియలు చేయబోమని మహిళ కుటుంబీకులు భీష్మించుకున్నారు. ఆదివారం బెలగావి బిమ్స్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆమె భర్త మనీష్, అతని కుటుంబమే ఆమెను హత్య చేశారని ఆరోపించారు.

వారందరినీ అరెస్టు చేసే వరకు మృతదేహాలను తీసుకునేది లేదంటూ ధర్నా నిర్వహించారు. దీంతో మూడు రోజుల నుంచి బిమ్స్ ఆసుపత్రి మార్చురీలోనే తల్లిపిల్లల మృతదేహాలు ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన బెళగావి హిండలగా గణపతి ఆలయం చెరువులో క్రిషా కేశ్వానీ (36),  పిల్లలు వీరెన్ (7), బావీర్ (4) మృతదేహాలు తేలాయి. ఇది తెలిసిన వెంటనే భర్త మనీష్, కుటుంబ సభ్యులు పరారయ్యారు.  కాగా, ఆదివారం మనీష్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ త్రిషకు వేరొకరితో సంబంధం ఉందని అదే ఆత్మహత్యలకు కారణం అని అన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే