దసరా నుంచి పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ... జనసేనాని కోసం కొత్త కాన్వాయ్

Siva Kodati |  
Published : Jun 12, 2022, 06:16 PM IST
దసరా నుంచి పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ... జనసేనాని కోసం కొత్త కాన్వాయ్

సారాంశం

దసరా నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త టూర్‌కి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన కోసం కొత్త కాన్వాయ్‌ని సిద్ధం చేశాయి ప్రభుత్వ వర్గాలు. ఈ మేరకు కొత్త బ్లాక్ స్కార్పియో కార్లు జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి.   

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఏర్పాట్లు  మొదలయ్యాయి. దీనిలో భాగంగా ఆయన కొత్త కాన్వాయ్ ఇప్పటికే ఆఫీసుకు చేరుకుంది. దసరా నుంచి ఏపీ అంతటా పర్యటించాలని పవన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కొత్త బ్లాక్ స్కార్పియో కార్లను పవన్ కల్యాణ్ టూర్ కోసం సిద్ధం చేశారు. అక్టోబర్ 5 నుంచి పవన్ పర్యటన ప్రారంభంకానుంది. 

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (ap assembly elections) ముందే వస్తాయన్న అంచనాతో బస్సు యాత్రకు రెడీ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan bus yatra) . విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా  బస్సు యాత్ర చేపట్టనున్నారు. 2023 మార్చిలోనే ఎన్నికలు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) . ఆ ఎన్నికలకు అందరూ సిద్ధంగా వుండాలంటూ పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి పవన్ బస్సు యాత్రను ప్రారంభిస్తారని మనోహర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 కాదు కదా.. 30 సీట్లు రావని ఆయన జోస్యం చెప్పారు. 6 నెలల్లో రాష్ట్రమంతా పవన్ పర్యటిస్తారని... ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ వుంటుందని నాదెండ్ల తెలిపారు. 

Also Read:Pawan Kalyan: ఫ్యాన్స్ కి బిగ్ షాక్... సినిమాలకు పవన్ గుడ్ బై... చివరి చిత్రం కానున్న హరి హర వీరమల్లు!

మరోవైపు 2019 చివర్లో పవన్ మరలా సినిమాల్లోకి కమ్ బ్యాక్ ప్రకటించారు. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేస్తే తప్పేంటి? నాకు తెలిసింది ఇదే? పార్టీ కోసం, కుటుంబం కోసం సినిమాలు చేయక తప్పదని వెల్లడించారు. కమ్ బ్యాక్ తర్వాత పవన్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు విడుదల చేశారు. వీటితో పాటు హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ మూవీ ప్రకటించడం జరిగింది. వినోదయ సిత్తం మూవీ అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ... ఇది కూడా ఆయన అప్ కమింగ్ చిత్రాల లిస్ట్ లో ఉంది. వీటిలో హరి హర వీరమల్లు మాత్రమే షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. 

అయితే అక్టోబర్ అంటే... యాత్ర మొదలు కావడానికి మిగిలింది మూడున్నర నెలల సమయం మాత్రమే. పవన్ యాత్ర 2023 మార్చి లో ముగుస్తుంది. కాబట్టి ఈ మూడు నెలల్లో సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది. పరిస్థితులు గమనిస్తుంటే భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి చిత్రాలు అటకెక్కినట్లే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే