అంతర్వేది నూతన రధ నిర్మాణానికి శ్రీకారం... ప్రభుత్వంపై లోకేష్ సీరియస్ (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 27, 2020, 2:47 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి వారికి నూతన రథ నిర్మాణం ఇవాళ(ఆదివారం) లాంఛనంగా ప్రారంభమయ్యింది.

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి వారికి నూతన రథ నిర్మాణం ఇవాళ(ఆదివారం) లాంఛనంగా ప్రారంభమయ్యింది. రధం నిర్మాణానికి ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండాలని ఉదయం 9గంటల నుంచి సుదర్శన శాంతి హోమం నిర్వహించిన అనంతరం పనులకు శ్రీకారం చుట్టారు. 

నూతన రధ నిర్మాణ పూజా కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, స్ధానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మమ్మిడివరం ఎమ్మెల్యే పోన్నాడ సతీష్ కుమార్ పాల్గొన్నారు. 

వచ్చే ఏడాది 2021 ఫిబ్రవరి 26న జరగబోయే స్వామి వారి కళ్యాణోత్సవం వరకు రధ నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసమే నిర్మాణ పనులకు సంబంధించిన నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నారు. ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించే అధికారులకు కూడా ఈ మేరకు ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు అందాయి. 

వీడియో

"

అయితే ఈ అంతర్వేది రధ నిర్మాణ పనులపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికన స్పందించారు. ''దేవుడి విగ్రహం ధ్వంసం అయితే కొత్త విగ్రహం పెడతాం. వెండి విగ్రహాలు పోతే నష్టం ఏంటి? కోటి రూపాయల రథం తగలబడితే దేవుడికి నష్టం ఏంటి అని భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైకాపా ప్రభుత్వ వ్యవహారశైలిలో మార్పు రాలేదు. టెండర్లు పిలవకుండా రథ నిర్మాణం ప్రారంభించి అంతర్వేదిలో అగ్నికుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిస్తున్నారు'' అన్నారు. 

''భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడం మాని నూతన రధ నిర్మాణం కోసం తక్షణమే అధికారులు టెండర్లు ఆహ్వానించాలి. రధ నిర్మాణంలో స్థానిక అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలి'' అని లోకేష్ సూచించారు. 
 

click me!