క్రికెట్ ఆడుకోక రాజకీయాలు నీకెందుకు: అంబటి రాయుడుని ఏకిపారేస్తున్న నెటిజన్లు..!

Published : Apr 21, 2023, 10:24 AM ISTUpdated : Apr 21, 2023, 10:37 AM IST
క్రికెట్ ఆడుకోక రాజకీయాలు నీకెందుకు:  అంబటి రాయుడుని ఏకిపారేస్తున్న నెటిజన్లు..!

సారాంశం

కొందరైతే రాయడానికి వీలు లేని పదాలను ఉపయోగించి మరీ విమర్శించడం గమనార్హం.  

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కి బాగానే క్రేజ్ ఉంది. ముఖ్యంగా మన తెలుగువాడు కావడంతో... ఆయనపై అందరూ అభిమానం చూపిస్తూ ఉంటారు. అయితే క్రికెట్ పక్కనపెట్టి ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానంటూ చెప్పారు. ఏ పార్టీలో చేరుతాడు అనే విషయంపై క్లారిటీ ఇవ్వకపోయినా... ఆయన వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. గతంలో ఆయన కాపు నియోజకవర్గానికి చెందిన వాడు కావడంతో జనసేనలో  చేరతాడంటూ ప్రచారం జరిగింది. అయితే... ఆయన సీఎం జగన్ ని పొగుడుతూ ట్వీట్ చేయడం దుమారం రేపింది.

"మన సిఎం వైఎస్ జగన్ ప్రసంగం అత్యద్భుతం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నమ్మేది, విశ్వసించేది మిమ్మల్నే సర్" అంటూ ఆయన ప్రశంసించారు. దాంతో అంబటి రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం ద్వారా తన పొలిటిక్ ఇన్నింగ్సును ప్రారంభిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైతే ఆయన అలా ట్వీట్ చేశాడో.. నెటిజన్లు విరుచుకుపడటం మొదలుపెట్టారు.

 

ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘నీ పని నువ్వు చూసుకోక ఈ రాజకీయాలు నీకు అవసరమా.. క్రికెట్ ఆడుకోరాదు’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, క్రికెట్ కెరీర్ ని అస్సాం చేసుకున్నావ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడితే.. తూర్పు తిరిగి దండం పెట్టడమే అంటూ మరో నెటిజన్ విమర్శించాడు.

ఒక దొంగని మరొక దొంగ మాత్రమే సమర్థిస్తాడని, ఒక నేరస్థుడిని మరో నేరస్థుడే వెనకేసుకు వస్తాడంటూ మరొకరు విమర్శించడం గమనార్హం. ఇక మరొకరు.. అంబటి రాయుడు జగన్ ని సమర్థించాడని.. జగన్ ని కూడా విమర్శించడం గమనార్హం. కనీసం పేపర్ చూడకుండా జిల్లాల పేర్లు కూడా పడకలేడని అలాంటి వాడికి సపోర్ట్ చేస్తావా అని తిట్టిపోస్తున్నాడు. కొందరైతే రాయడానికి వీలు లేని పదాలను ఉపయోగించి మరీ విమర్శించడం గమనార్హం.

కొందరేమో.. మొన్నటి వరకు ఓ క్రికెటర్ గా అంబటి రాయుడు మీద ఎంతో గౌరవం ఉందని... ఇప్పుడు ఈ ట్వీట్ తో ఆ గౌరవం మొత్తం పోయిందంటూ విమర్శించారు. మరొకరు కొత్త పేటీఎం కు మార్కెట్ లోకి వచ్చిందని మరికొందరు కామెంట్ చేయడం గమనార్హం. ఏది ఏమైనా.. రాజకీయాల్లోకి వస్తే తనకు మద్దతు వస్తుందనుకున్న అంబటి రాయుడుకి మాత్రం ఊహించని షాక్ ఎదురైంది. మరి ఆయన తన నిర్ణయంలో ఏవైనా మార్పులు చేస్తారేమో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu