అయ్యో మస్తాన్‌... మరో లగడపాటి అయ్యావా..!

Published : Jun 04, 2024, 03:35 PM IST
అయ్యో మస్తాన్‌... మరో లగడపాటి అయ్యావా..!

సారాంశం

ఏదో ఒక పార్టీకి అనుకూలంగా చెప్పడం చాలా కామన్. కానీ.. మస్తాన్ అక్కడితో ఆగలేదు. ఈ రోజు ఉదయం టీడీపీ కూటమి ఆధిపత్యంలో ఉన్నా కూడా.. తన సర్వేనే నిజం అవుతుందని గట్టిగా చెప్పాడు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలిసిపోయాయి. ఈ ఎన్నికల ఫలితాల కోసం రెండు రాష్ట్రాల ప్రజలు నెల రోజులుగా ఎదురు చూశారు. టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే... ఈ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్  జరిగిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఆ ఫలితాల్లో కొందరు టీడీపీ కూటమి గెలుస్తుంది అంటే... ఆరా మస్తాన్ సర్వే మాత్రం.. కచ్చితంగా వైసీపీ దే గెలుపు అని చెప్పింది.

రాష్ట్రంలో 56శాతం మహిళలు వైసీపీకే ఓటు వేశారని...  42 శాతం మాత్రమే టీడీపీ కూటమికి ఓట్లు వేశారని ఆ సర్వేలో మస్తాన్ చెప్పాడు. జగన్ ఇస్తున్న పథకాల కారణంగా.. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడు అని ఆయన చాలా గట్టిగా చెప్పాడు. ఎగ్జిట్ పోల్ సర్వేలు అంటే... ఏదో ఒక పార్టీకి అనుకూలంగా చెప్పడం చాలా కామన్. కానీ.. మస్తాన్ అక్కడితో ఆగలేదు. ఈ రోజు ఉదయం టీడీపీ కూటమి ఆధిపత్యంలో ఉన్నా కూడా.. తన సర్వేనే నిజం అవుతుందని గట్టిగా చెప్పాడు.

ఫలితాలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారమే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో లీడ్‌, మొదటి రెండు, మూడు రౌండ్ల లీడ్‌ కూటమికి అనుకూలంగానే ఉంటుందని తాను ముందే అంచనా వేశామన్నారు. ఆ తర్వాత ఫలితాలు మారే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలో టీడీపీ ఓటు బ్యాంకు వంద శాతం ట్రాన్స్‌ ఫర్‌ అయిందని... కానీ, టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో ఆ పరిస్థితి లేదు అని చెప్పాడు. కానీ.. ఆయన చెప్పింది ఒక్కటి కూడా జరగలేదు. ఆయన సర్వే మొత్తం రివర్స్ అయ్యింది.

ఆరా మస్తాన్ సర్వే రివర్స్ కావడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మరో లగడపాటి అవ్వడం ఖాయని.. ఈ దెబ్బతో మరోసారి.. ఎగ్జిట్ పోల్స్  సర్వే చెప్పడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

2014 ఎన్నికల సమయంలోనూ లగడపాటి ఇలాంటి సర్వేనే చెప్పాడు. కచ్చితంగా టీడీపీనే గెలుస్తుందని  చెప్పాడు. కానీ... అప్పుడు ఫలితం రివర్స్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ లగడపాటి  సర్వేల గురించి చెప్పడం మానేశాడు. ఇప్పుడు... ఈ ఫలితాల దెబ్బతో ఆరా మస్తాన్ కూడా.. మళ్లీ సర్వేలు ఇవ్వడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా  ఈ ఎన్నికలు ఎంత హాట్ టాపిక్ అయ్యాయో... సర్వే చెప్పి.. ఈ ఆరా మస్తాన్ సైతం అంటే హాట్ టాపిక్ గా నిలవడం విశేషం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వారందరిని పార్టీనుండి సస్పెండ్ చేస్తున్న | Dy CM Pawan Kalyan Sensational Comments | Asianet Telugu
నది కాలుష్యం పై అధికారులకి చెమటలు పట్టించిన పవన్ | Pawan Kalyan Inspects Pollution | Asianet Telugu