బాబుతో నెల్లూరు జడ్పీ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి భేటీ:త్వరలో టీడీపీలోకి

Published : Nov 07, 2018, 06:36 PM IST
బాబుతో నెల్లూరు జడ్పీ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి  భేటీ:త్వరలో టీడీపీలోకి

సారాంశం

నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో  సమావేశం సింహపురి రాజకీయాల్లో హట్ హట్ గా మారింది.


అమరావతి: నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో  సమావేశం సింహపురి రాజకీయాల్లో హట్ హట్ గా మారింది.బొమ్మిరెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరే అవకాశం ఉంది.మంగళవారం నాడు బాబుతో రాఘవేంద్రరెడ్డి అమరావతిలో సమావేశమయ్యారు.

బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైసీపీలో కొనసాగారు. అయితే తనకు తెలియకుండానే ఆనం రామనారాయణరెడ్డిని తన నియోజకవర్గంలో ఇంచార్జీగా ప్రకటించడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. 

బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని టీడీపీలోకి రప్పించేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లా నేతలతో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి  ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. తనకు మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డితో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు. 

టీడీపీలోకి వస్తే... అన్ని రకాలుగా న్యాయం చేస్తానని చంద్రబాబునాయుడు బొమ్మిరెడ్డికి హామీ ఇచ్చినట్టు సమాచారం. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృతంగా పర్యటించాలని ఆయన బొమ్మిరెడ్డిని కోరారు. త్వరలోనే బొమ్మిరెడ్డి టీడీపీలో చేరనున్నారు. పార్టీలో చేరే తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు