అడవిలో తప్పిపోయిన మూడేళ్ల బాలుడు సంజు.. 9 రోజులుగా కొనసాగుతున్న గాలింపు.. !

By AN TeluguFirst Published Jul 8, 2021, 11:30 AM IST
Highlights

నెల్లూరు : అడవిలో అదృశ్యమయ్యాడని భావిస్తున్న మూడేళ్ల బాలుడు సంజు కోసం గాలింపు కొనసాగుతోంది. సమీప గ్రామాలు, అటవీ ప్రాంతాన్ని పోలీసులు, గ్రామస్తులు జల్లెడ పడుతున్నారు.

నెల్లూరు : అడవిలో అదృశ్యమయ్యాడని భావిస్తున్న మూడేళ్ల బాలుడు సంజు కోసం గాలింపు కొనసాగుతోంది. సమీప గ్రామాలు, అటవీ ప్రాంతాన్ని పోలీసులు, గ్రామస్తులు జల్లెడ పడుతున్నారు. 

అయినా బాలుడు సంజు ఆచూకీ ఇంకా తెలియలేదు. వారం రోజులుగా వెతుకుతున్నా ఇంకా జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగి ఉన్నారు. సంజు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ భోరున విలపిస్తున్నారు. 

అయితే సంజు అదృశ్యమైన రోజుకి ముందు రోజు కొన్ని సంచార కుటుంబాలు గ్రామానికి వచ్చాయి. దీంతో వారేమైనా బాలుడిని ఎత్తుకెళ్లి ఉంటారా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఆ సంచార కుటుంబాలను ట్రేస్ చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఉయ్యాలపల్లి గ్రామంలోని అరుంధతి కాలనీకి చెందిన సంజు గత నెల 29న అదృశ్యమయ్యాడు. బాలుడి తండ్రి బుజ్జయ్య మేకలు కాస్తుంటాడు. ప్రతీరోజూ బుజ్జయ్య మేకల మందను అడవిలోకి తోలుకెళ్లే సమయంలో.. సంజు కూడా ఇంటినుంచి కొంత దూరం అతనితో పాటు వెళ్లేవాడు. ఆ తరువాత ఇంటికి తిరిగొచ్చేవాడు. కానీ జూన్ 29న తండ్రి వెనకాలే వెళ్లిన సంజు... ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో సంజు అడవిలోకే వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు.

బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ రోజు నుంచి సెర్చింగ్ కొనసాగుతోంది. బాలుడు అదృశ్యమవ్వడానికి ముందు ఉయ్యాలపల్లి గ్రామంలో రాములవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. దీనికోసం ఎక్కడెక్కడినుంచో చిరు వ్యాపారులు గ్రామానికి తరలివచ్చారు. వీళ్లలో ఎవరైనా బాలుడిని తీసుకెళ్లి ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు గ్రామానికి వచ్చిన చిరు వ్యాపారుల ఫోన్ నంబర్లను పోలీసులు సేకరిస్తున్నారు.

సెర్చింగ్ లో భాగంగా మంగళవారం (జులై 6) పోలీస్ జాగిలాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జాగిలాల్ని రంగంలోకి దించినా.. బాలుడి ఇంట్లో అతని దుస్తులు, చెప్పులు వాసన చూసి అవి పెనుశిల అడవిలోకి పరుగుతీసింది. అడవిలో ఉన్న స్వర్ణముఖి కాలువ వద్ద ఆగడంతో పోలీసులు చుట్టు పక్కల గాలించారు. అయినా బాలుడి ఆచూకీ లభించలేదు. 

click me!