ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ : జాబితాలో కనిపించని పేరు.. కన్నీటి పర్యంతమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Siva Kodati |  
Published : Apr 10, 2022, 06:39 PM ISTUpdated : Apr 10, 2022, 06:55 PM IST
ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ : జాబితాలో కనిపించని పేరు.. కన్నీటి పర్యంతమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

సారాంశం

ఏపీ కొత్త మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంతో వైసీపీ సీనియర్ నేత , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరాశకు లోనయ్యారు. ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూనే కన్నీటి పర్యంతమయ్యారు.   

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ సందర్భంగా రాష్ట్రంలో ఉద్విగ్న పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి పదవులు వైసీపీ (ysrcp) ఆశావహుల్లో భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. కొత్త కేబినేట్‎లో పదవి దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు మంత్రుల జాబితా కంటతడి పెట్టిస్తోంది. తమకు పదవి రాకుండా పోతోందనే ఆవేదన కళ్ల నుంచి నీటి రూపంలో బయటకు వస్తోంది. వైసీపీ సీనియర్ నేత , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridar reddy) ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అయినా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృష్టి చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. 

అంతకుముందు తీవ్ర అసంతృప్తితో అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీలో ముందు నుంచి తనకు ప్రాధాన్యతలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించలేదని సన్నిహితుల దగ్గర వాపోయారు కోటంరెడ్డి. అంతేకాదు.. రేపటి నుంచి నియోజకవర్గంలో తలపెట్టిన గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

ఇకపోతే.. కొత్త మంత్రివర్గంలో చివరి నిమిషంలో మార్పులు చేపట్టారు వైఎస్ జగన్. కేబినెట్‌లో తిప్పేస్వామికి చివరి నిమిషంలో చోటు దక్కలేదు. కొత్త కేబినెట్‌లో మళ్లీ ఆదిమూలపు సురేష్‌‌కు చోటు కల్పించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో కొత్త మంత్రుల జాబితాను ఆదివారం విడుదల చేశారు.  25 మందితో కొత్త టీమ్‌ను సీఎం జగన్ ఎంపిక చేసుకొన్నారు. గత కేబినెట్ లో పనిచేసిన 10 మందిని AP Cabinet Reshuffle లో చోటు కల్పించారు. కొత్త వారిలో 15 మందికి చోటు కల్పించారు. సీనియారిటీతో పాటు పాలనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 10 మంది పాత వారికి కేబినెట్ లో చోటు కల్పించారు. దీనికి తోడు ఆయా జిల్లాల సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కూడా పాతవారికి  చోటు కల్పించారు.

గత Cabinet లో చురుకుగా వ్యవహరించిన మంత్రులను పార్టీ అవసరాల కోసం వినియోగించుకోనున్నారు. గత మంత్రివర్గం నుండి తప్పించిన 15  మందికి పార్టీ కోసం వినియోగించుకోనున్నారు. వచ్చే రెండేళ్ల తర్వాత ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గాను అవసరమైన టీమ్ ను ఎంపిక చేసుకోవాలని YS Jagan భావించారు. పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేసేందుకు గాన మంత్రివర్గం నుండి తప్పించిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. 

కొత్త మంత్రివర్గంలో బీసీ సామాజిక వర్గం నుండి 10 మంది, కాపు సామాజిక వర్గం నుండి నలుగురు, రెడ్డి సామాజిక వర్గం నుండి నలుగురు, ఎస్సీ సామాజిక వర్గం నుండి ఐదుగురు, ఎస్టీ, మైనార్టీలకు ఒక్కరేసి చొప్పున  చోటు దక్కింది. సామాజిక సమీకరణాలు లేదా ఇతరత్రా కారణాలతో వారికి కేబినెట్ లో చోటు కల్పించలేకపోతే నామినేటేడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. 2019 లో ఏపీ సీఎం వైఎస్ జగన్  మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే సమయంలోనే రెండున్నర ఏళ్లపాటే మంత్రులుంటారని జగన్  చెప్పారు.  అయితే  మూడేళ్ల తర్వాత మంత్రివర్గాన్న పునర్వవ్యవస్థీకరించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ సీఎం కొత్త టీమ్ ఇదే

1.ధర్మాన ప్రసాదరావు,
2.సీదిరి అప్పలరాజు
3.బొత్స సత్యనారాయణ
4.గుడివాడ అమర్ నాథ్
5.సి. రాజన్నదొర
6.తాడిశెట్టి రాజా
7.చెల్లుబోయిన వేణుగోపాల్
8.బూడి ముత్యాలనాయుడు
9.నారాయణస్వామి
10.ఉషశ్రీచరణ్
11.విశ్వరూప్
12.జోగి రమేష్
13.అంబటి రాంబాబు
14.మేరుగ నాగార్జున
15.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
16.పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి
17.కారుమూరి నాగేశ్వరరావు
18.కొట్టు సత్యనారాయణ
19.కళావతి
20.అంజద్ భాషా
21.తానేటి వనిత
22.గుమ్మనూరు జయరాం
23.తిప్పేస్వామి
24. ఆర్. కే. రోజా
25.కాకాని గోవర్ధన్ రెడ్డి

PREV
click me!

Recommended Stories

Indian Navy Banquet at IFR 2026: భారత నౌకాదళం విందులో సతీసమేతంగా హాజరైన పవన్| Asianet News Telugu
Nara Lokesh Speech: ఎయిమ్స్ స్నాతకోత్సవంలో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu