నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలనం

By narsimha lode  |  First Published Jan 29, 2023, 10:34 AM IST

నెల్లూరు  రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  సంచలన ఆరోఫణలు చేశారు. తన కదలికలపై  నిఘా ఏర్పాటు  చేశారన్నారు.


నెల్లూరు:  తనపై  ఇంటలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు  చేశారు.  తన ఫోన్  ను ట్యాప్  చేస్తున్నారన్నారు.   ఈ విషయం తనకు  ముందు  నుండే  తెలుసునన్నారు. రహస్యాలు  మాట్లాడుకొనేందుకు  తనకు  వేరే ఫోన్  ఉందన్నారు. తన వద్ద  12 సిమ్ కార్డులున్నాయని  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చెప్పారు. ఫేస్ టైమర్  , టెలిగ్రాం కాల్స్  ను  పెగాసెస్  రికార్డు చేయలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  పోలీసులనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.   అధికార పార్టీకి చెందిన  తనపై  ఎందుకు  నిఘా  పెడుతున్నారని ఆయన  ప్రశ్నించారు.  అవసరమైతే  తనపై నిఘా  కోసం  ఐపీఎస్ అధికారిని నియమించుకోవాలని  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  సీరియస్ వ్యాఖ్యలు  చేశారు.    

మంత్రివర్గ విస్తరణలో  మంత్రి పదవి దక్కుతుందని  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావించారు.  కానీ  నెల్లూరు జిల్లా నుండి  కాకాని గోవర్ధన్ రెడ్డికి  మంత్రివర్గంలో  చోటు  దక్కింది. మంత్రివర్గంలో  చోటు దక్కకపోవడంపై  కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి   తీవ్ర  అసంతృప్తిని వ్యక్తం  చేశారు.  

Latest Videos

undefined

మాజీ మంత్రి అనిల్ కుమార్   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో  గతంలో ఒకసారి భేటీ అయ్యారు.ఈ ఇద్దరు కూడా  కాకాని గోవర్ధన్ రెడ్డికి  వ్యతిరేకంగా  విమర్శలు  చేశారు.ఈ భేటీ అప్పట్లో  చర్చకు దారితీసింది.  ఇటీవల కాలంలో  అధికారుల తీరుపై  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  విమర్శలు గుపిస్తున్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సీఎం జగన్  పిలిపించారు.   జిల్లా రాజకీయాలతో పాటు  తన అసంతృప్తికి గల కారణాలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు.  అధికారులపై  తాను  ఎందుకు  విమర్శలు చేయాల్సి వచ్చిందో  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ కు వివరణ ఇచ్చారు. 

  తాజాగా  మరోసారి  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు ప్రస్తుతం  మరోసారి చర్చకు దారి తీశాయి.  గతంలో కూడా  వినూత్న నిరసనలతో  కోటంరెడ్డి శ్రీధర్  రెడ్డి వార్తల్లో నిలిచారు.  డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ  డ్రైనీజీలో నిలబడి  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. 

ఇదే జిల్లాకు  చెందిన  మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి   కూడా  ప్రభుత్వంపై విమర్శలు  చేశారు.   ఆనం రామనారాయణరెడ్డి విమర్శల నేపథ్యంలో  పార్టీ ఇంచార్జీ పదవి నుండి  ఆయనను తప్పించారు. గడప గడపకు  మన ప్రభుత్వం  కార్యక్రమం నిర్వహించవద్దని  కూడా  ఆనం రామనారాయణరెడ్డిని ఆదేశించింది. 


 

click me!