ఫేస్ రికగ్నిషన్ యాప్... ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు సఫలం

By Siva KodatiFirst Published Sep 1, 2022, 7:41 PM IST
Highlights

ఫేస్ రికగ్నిషన్ యాప్, అటెండెన్స్ వివాదాలపై ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను తమ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఉపాధ్యాయులు అంగీకరించారు. 
 

ఫేస్ రికగ్నిషన్ యాప్, అటెండెన్స్ వివాదాలపై ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను తమ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఉపాధ్యాయులు అంగీకరించారని చెప్పారు. సాంకేతిక సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పు రావాలనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఫేక్ రికగ్నిషన్ యాప్ అమలుకు 15 రోజుల గడువు కోరారని మంత్రి తెలిపారు. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని బొత్స చెప్పారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లమని చెప్పామని సత్యనారాయణ పేర్కొన్నారు. 

Also Read:నేటి నుండి ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో యాప్ ఆధారిత హాజరు: వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

అంతకుముందు ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. మా ఫోన్లలోనే యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అంగీకరించామన్నారు. సాంకేతిక సమస్యలు ఉన్నాయని మంత్రికి వివరించామని.. ఫేస్ యాప్ అటెండెన్సులో ఉన్న టెక్నికల్ ఎర్రర్స్ పరిశీలించేందుకు 15 రోజుల సమయం కోరామని సాయి శ్రీనివాస్ పేర్కొన్నారు. సాంకేతిక ఇబ్బందులు తొలగించిన తర్వాతే.. పూర్తి స్థాయిలో అమలు చేయాలన్న ఆయన.. ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేక 248 ఎంఈఓ పోస్టులను ప్రభుత్వ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేయబోతున్నారని చెప్పారు. అలాగే 672 ఎంఈఓ పోస్టులను జెడ్పీ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేయనున్నారని సాయి శ్రీనివాస్ తెలిపారు. ఫేస్ రిక్నగేషన్ యాప్ మా ఫోన్లల్లోనే డౌన్ లోడ్ చేసుకోవాలని మంత్రి సూచించారని ఆయన పేర్కొన్నారు.టైమ్ ప్రకారం అటెండెన్స్ వేసినా.. అప్లోడింగులో ప్రాబ్లం ఉంటే.. దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారని సాయిశ్రీనివాస్ వెల్లడించారు. 

యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఫేస్ రిక్నగేషన్ అటెండెన్సుకు జీతాలతో లింకు పెట్టమని మంత్రి బొత్స హామీనిచ్చారని తెలిపారు. ఎంఈఓ పోస్టులను ఎఫ్ఏసీలుగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనపై ఆలోచన చేస్తామని వెంకటేశ్వర్లు చెప్పారు. 
 

click me!