బాయ్ ఫ్రెండ్ మాట్లాడట్లేదని... నీట్ విద్యార్థిని ఆత్మహత్య

Published : Apr 29, 2020, 10:36 AM IST
బాయ్ ఫ్రెండ్ మాట్లాడట్లేదని... నీట్ విద్యార్థిని ఆత్మహత్య

సారాంశం

కరోనా లాక్ డౌన్ కారణంగా క్యాంపస్ మూసివేయడంతో ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలోనే రంజిత తన క్లాస్‌మేట్ అయిన ఓ విద్యార్థితో రోజూ ఫోన్లో మాట్లాడేది. అయితే మూడు రోజులుగా అతడు ఫోన్ చేయడం లేదు.

తన బాయ్ ఫ్రెండ్ తనతో మాట్లాడటం మానేశారని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇందిరమ్మకాలనీకి చెందిన అంజనాదేవి మండలంలోని బాలయ్యగారిపల్లె పంచాయతీ సచివాలయంలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తోంది. ఆమె కుమార్తె రంజిత(18) విజయవాడలోని చైతన్య కళాశాలలోని భవిష్య క్యాంపస్‌లో నీట్‌ కోచింగ్‌ తీసుకుంటోంది.

కరోనా లాక్ డౌన్ కారణంగా క్యాంపస్ మూసివేయడంతో ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలోనే రంజిత తన క్లాస్‌మేట్ అయిన ఓ విద్యార్థితో రోజూ ఫోన్లో మాట్లాడేది. అయితే మూడు రోజులుగా అతడు ఫోన్ చేయడం లేదు. ఆమె చేసినా ఆ యువకుడు ఫోన్ ఎత్తడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రంజిత మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు శవమై ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ కారణంతో నే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

22 AP Youth Rescued from Cyber-Slavery in Myanmar: కరెంటు షాక్ పెట్టేవాళ్ళు | Asianet News Telugu
IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం