దళిత యువకుడిపై శిరోముండనం: విచారణకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశం

By narsimha lodeFirst Published Jul 26, 2020, 10:47 AM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో శిరోముండనం చేసిన  ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణకు ఆదేశించింది. సీతానగరంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొన్న యువకుడు ప్రసాద్ పై దాడి చేసి శిరో ముండనం చేశారు


కాకినాడ:తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో శిరోముండనం చేసిన  ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణకు ఆదేశించింది. సీతానగరంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొన్న యువకుడు ప్రసాద్ పై దాడి చేసి శిరో ముండనం చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు లేఖ రాశాడు. 

ఈ లేఖపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల పేర్లు కూడ స్పష్టంగా తెలపాలని కోరింది కమిషన్. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు లేఖ రాసింది. 

దళితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. దళితులకు తమ పార్టీ అండగా ఉంటుంందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటనలో ఇప్పటికే ఎస్ఐ ను వీఆర్ కు పంపారు. ఇదే కేసులు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొన్నారు. ఈ ఘటనపై రాష్ట్రంలో దళిత సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

click me!