వేట కుక్కలై వేటాడే రోజు వస్తోంది: రఘురామకృష్ణంరాజు సంచలనం

By narsimha lodeFirst Published 6, Aug 2020, 4:07 PM
Highlights

అమరావతిలో మహిళా రైతులు హైవేపై గాంధేయవాదంలో నిరసన తెలిపితే.. కుక్కలతో పోల్చడం దారుణమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. ముఖ్యమంత్రిగారు వారు వేటకుక్కలై వేటాడే సమయం దగ్గరపడే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు.

అమరావతి:అమరావతిలో మహిళా రైతులు హైవేపై గాంధేయవాదంలో నిరసన తెలిపితే.. కుక్కలతో పోల్చడం దారుణమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. ముఖ్యమంత్రిగారు వారు వేటకుక్కలై వేటాడే సమయం దగ్గరపడే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు.

also read:నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వై కేటగిరి భద్రత

గురువారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.ఇలాంటి పోస్టింగులు పెట్టినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని రాఘురామకృష్ణంరాజు సీఎంను కోరారు. రంగనాయకమ్మ అనే వృద్ధ మహిళ ఎవరో పెట్టిన పోస్టింగ్‌ను ఫార్వర్డ్ చేస్తే ఆమెపై కేసులు పెట్టినప్పుడు ఇటువంటి వాళ్లపై కేసులు పెట్టకపోతే అపార్థం చేసుకోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఎస్వీబీసీ ఛానెల్‌లో రామమందిర శంకుస్థాపనను ప్రసారం చేయకపోవడం దారుణమన్నారు.హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని ఆయన సీఎంకు సూచించారు.సీఎం జగన్‌పై అభిమానం ఉంటే మరోవిధంగా చాటుకోవాలిగానీ గుడి కడతానని గోపాలపురం ఎమ్మెల్యే అనడం సిగ్గుచేటన్నారు.

త్వరలో అమరావతిలో "మనోధైర్య" యాత్ర చేస్తానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే అమరావతికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 సొంత పార్టీ నేతల నుంచే రక్షణ లేకుండా పోయిందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.. తన ఫిర్యాదు మేరకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరిశీలించి వై భద్రత కల్పించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.


 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 6, Aug 2020, 4:06 PM