రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదులు:హైకోర్టులో ఎంపీ క్వాష్ పిటిషన్లు

Published : Jul 10, 2020, 05:03 PM ISTUpdated : Jul 13, 2020, 12:50 PM IST
రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదులు:హైకోర్టులో ఎంపీ క్వాష్ పిటిషన్లు

సారాంశం

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  ఏపీ హైకోర్టులో శుక్రవారం నాడు రెండు క్వాష్ పిటిషన్లను దాఖలు చేశారు.తనపై నమోదైన కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  ఏపీ హైకోర్టులో శుక్రవారం నాడు రెండు క్వాష్ పిటిషన్లను దాఖలు చేశారు.తనపై నమోదైన కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గురువారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం నాడు మంత్రి శ్రీరంగనాథరాజు ఎంపీపై పోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

also read:రఘురామకృష్ణంరాజు Vsవైసీపీ ఎమ్మెల్యేలు: ఎంపీపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు

ఇవాళ  మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజులు వేర్వేరుగా వేరే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

ఈ కేసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లలో రఘురామకృష్ణంరాజు  కోరారు.  ఈ క్వాష్ పిటిషన్లపై ఎంపీ రఘురామకృష్ణంరాజు విచారణను వాయిదా వేశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాాలకు పాల్పడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజుపై  అనర్హత వేటేయాలని కోరుతూ లోక్ సభ స్పీకర్  ఓం బిర్లాకు  ఈ నెల 3వ తేదీన వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సాక్ష్యాలను కూడ వైసీపీ ఎంపీలు స్పీకర్ కు సమర్పించారు. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu