ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం: కీలకాంశాలపై చర్చ

Published : Jul 10, 2020, 04:40 PM IST
ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం: కీలకాంశాలపై చర్చ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపుగా ప్రతిపాదనలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆయా శాఖలకు ఆదేశించింది ప్రభుత్వం. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపుగా ప్రతిపాదనలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆయా శాఖలకు ఆదేశించింది ప్రభుత్వం. 

పలు కీలక అంశాలపై  ఈ కేబినెట్ లో చర్చించనున్నారు. గత నెల 11వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశం జరిగిన మరునాడే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు.

ఈ సమావేశంలోనే గత ప్రభుత్వం తీసుకొన్న పలు పథకాల్లో చోటు చేసుకొన్న అవినీతిపై కేబినెట్ సబ్ కమిటి నివేదిను సీఎం జగన్ కు నివేదికను ఇచ్చింది.
ఈ నెల 16వ తేదీన ఏఫీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.ఈ బడ్జెట్ కు అదే రోజు ఉదయం కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ సమావేశం తర్వాత ఈ నెల 15వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, మూడు రాజధానులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

విద్యార్థుల విజయం వెనుక కష్టాలు విని మంత్రి లోకేష్ ఎమోషనల్ Shining Stars Award 2026 | Asianet Telugu
భోగాపురంలో స్కూల్ సందర్శించిన కేంద్ర మంత్రిచిన్నారుల ప్రతిభ కి నారా లోకేష్ ఫిదా| Asianet Telugu