కరోనా దెబ్బ: నరసరావుపేట కమిషనర్ శివారెడ్డి కావలికి బదిలీ

Published : May 01, 2020, 12:51 PM IST
కరోనా దెబ్బ: నరసరావుపేట కమిషనర్ శివారెడ్డి కావలికి బదిలీ

సారాంశం

 గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిపై శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కరోనాను కట్టడి చేయడంలో  వైఫల్యం చెందారనే నెపంతో ఆయనపై ప్రభుత్వం బదిలీ చేసింది. గురువారం నాడు కర్నూల్ కార్పోరేషన్ రవీంద్రబాబుపై కూడ సర్కార్ వేటు వేసిన విషయం తెలిసిందే.


నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిపై శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కరోనాను కట్టడి చేయడంలో  వైఫల్యం చెందారనే నెపంతో ఆయనపై ప్రభుత్వం బదిలీ చేసింది. గురువారం నాడు కర్నూల్ కార్పోరేషన్ రవీంద్రబాబుపై కూడ సర్కార్ వేటు వేసిన విషయం తెలిసిందే.

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి విఫలమయ్యారని సర్కార్ భావిస్తోంది. దీంతో ఆయనపై బదిలీ వేటు వేసింది. నరసరావుపేట నుండి నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటికి ఆయనను బదిలీ చేసింది ప్రభుత్వం.

alao read:ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 60 కేసులు, మొత్తం 1463కి చేరిక

కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి.  నరసరావుపేటలో  ఢిల్లీ నుండి వచ్చిన ఓ వ్యక్తి టీ స్టాల్ కు వచ్చాడు. టీ స్టాల్ వద్ద టీ తాగాడు. దీంతో నరసరావుపేటలో కరోనా కేసులు పెరిగినట్టుగా అధికారులు గుర్తించారు.

కరోనా విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో కమిషనర్ విఫలం చెందారని సర్కార్ అభిప్రాయంతో ఉంది. దీంతో ఆయనను నరసరావుపేట నుండి బదిలీ చేసింది. ఆయనను కావలికి బదిలీ చేసింది.కావలి మున్సిపల్ కమిషనర్ కు నరసరావుపేట కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. 

కర్నూల్ లో కరోనా కేసులను అరికట్టడంలో వైఫల్యం చెందినందుకు గాను కర్నూల్ కార్పోరేషన్  కమిషనర్ రవీంద్రబాబుపై గురువారం నాడు ప్రభుత్వం వేటేసింది. ఆయన స్థానంలో ఐఎఎస్ అధికారి బాలాజీని నియమించిన విషయం తెలిసిందే.


 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu