ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 60 కేసులు, మొత్తం 1463కి చేరిక

Published : May 01, 2020, 11:47 AM ISTUpdated : May 01, 2020, 11:59 AM IST
ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 60 కేసులు, మొత్తం 1463కి చేరిక

సారాంశం

:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 60 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1463కి చేరుకొన్నాయి  


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 60 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1463కి చేరుకొన్నాయి

గత 24 గంటల్లో 7902 శాంపిల్స్ ను పరీక్షిస్తే 60 మందికి కరోనా ఉన్నట్టుగా తేలిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన 1463 కేసుల్లో 1027 కేసులు యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం తెలిపింది.కరోనా సోకిన రోగులు 403 మంది ఇప్పటివరకు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 33 మంది మృతి చెందినట్టుగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

 


గత 24 గంటల్లో కర్నూల్ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కర్నూల్ జిల్లాలో 25 కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం తెలిపింది. కర్నూల్ తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. గుంటూరులో 19 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 6,విశాఖపట్టణంలో 2, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి.

also read:కరోనా ఎఫెక్ట్: గుజరాత్‌ నుండి ఏపీకి చేరుకొన్న 4 వేల మత్స్యకారులు

ఇక రాష్ట్రంలో 411 కేసులతో కర్నూల్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. కర్నూల్ తర్వాతి స్థానంలో గుంటూరు నిలిచింది. గుంటూరులో306 కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో 246 కేసులు,చిత్తూరులో 80, అనంతపురంలో 67 ,తూర్పుగోదావరిలో 42, కడపలో 79, నెల్లూరులో 84, ప్రకాశంలో 60, శ్రీకాకుళంలో 5, విశాఖపట్టణంలో 25, పశ్చిమగోదావరిలో 58 కేసులు నమోదయ్యాయి.

ఇక రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఇంతవరకు ఒక్క కేసు కూడ నమోదు కాలేదు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu