జిల్లాలోని నరసరావుపేటలో ఓ మహిళా వాలెంటీరు పట్ల స్థానిక మున్సిల్ కమీషనర్ దురుసుగా ప్రవర్తించడం చర్చాంశనీయమైంది.
గుంటూరు జిల్లా, నరసరావుపేట మహిళా వార్డు వాలెంటీరుపై నరసరావుపేట కమీషనర్ కె.రామచంద్రారెడ్డి చిందులు తొక్కాడు. వాలెంటీర్ల కు నిర్ధేశిత పని గంటలు ఏవీ లేక పోయినప్పటికీ ఉదయం నుండి సాయంత్రం వరకు సచివాలయంలో ఉండాలంటూ వార్డు అడ్మిన్ వేధింపులకు పాల్పడుతోంది.
సచివాలయ సిబ్బంది వాళ్ళు చేయవలసిన పనులను కూడా తమతో చేపిస్తున్నారంటూ వాలెంటీర్లు వాపోతున్నారు. జిల్లాలోని నరసరావుపేటలో ఓ మహిళా వాలెంటీరు పట్ల స్థానిక మున్సిల్ కమీషనర్ దురుసుగా ప్రవర్తించడం చర్చాంశనీయమైంది.
వివరాలలోకి వెళితే..షేక్ అక్తర్ అనే మహిళ 3వ వార్డులో వాలెంటీరుగా విధులు నిర్వర్తిస్తుంది. ఐతే అక్కడి అడ్మిన్ గా పనిచేసే నవ్య అనే సచివాలయ ఉద్యోగి తనపై ఫిర్యాదు చేయడంతో కమీషనర్ తనకు ఫోనుచేసి అసభ్యంగా మాట్లాడారని మహిళా వాలెంటీరు ఆవేదన వ్యక్తం చేసింది. గత జనవరి నెలలో తాను విధులలో చేరినప్పటి నుండి తనకు నిర్ధేశించిన అన్నిపనులూ సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ఎప్పుడూ సచివాలయంలోనే అందుబాటులో ఉండాలంటూ తనను వార్డ్ అడ్మిన్ వేధింపులకు గురిచేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
గతంలో 3 వ వార్డు వాలెంటీర్లు అందరూ అడ్మిన్ పై కమీష్నర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ కక్ష మనసులో పెట్టుకుని తమను మరిన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె తెలియజేశారు. వార్డు అడ్మిన్ చెప్పారని కమీషనర్ తనను ఫోనులో బూతులు మాట్లాడుతూ నీకు దిక్కున్న చోట చెప్పుకో మంటూ... బొక్కలో వేసి తోలు వలిపిస్తా.. అంటూ బెదిరిస్తున్నారని మహిళా వాలెంటీరు ఆవేదన వ్యక్తం చేశారు.
తనతో అసభ్యంగా మాట్లాడిన కమీషనర్ రామచంద్రారెడ్డి పై, వార్డు అడ్మిన్ నవ్యలపై చర్యలు తీసుకొవాలని ఆమె వేడుకున్నారు.