విషాదం : గ్యాస్ సిలిండర్ పేలి.. నిద్రిలోనే తండ్రీ,కొడుకు సజీవదహనం..

Published : Aug 28, 2021, 10:01 AM IST
విషాదం : గ్యాస్ సిలిండర్ పేలి.. నిద్రిలోనే తండ్రీ,కొడుకు సజీవదహనం..

సారాంశం

 గ్రామానికి చెందిన బొమ్మడి నాగరాజు ఇంట్లో నుంచి తెల్లవారుజామున పొగలు వచ్చాయి. దగ్గరికి వెళ్లి చూడగా గ్యాస్ సిలిండర్ పేలడంతో వచ్చిన మంటల్లో నిద్రిస్తున్న బొమ్మడి నాగరాజు (35), కుమారుడు రోహిత్ కుమార్ (6) విగతజీవులుగా కనిపించారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ బండ పేలిన ఘటనలో తండ్రి, కుమారుడు సజీవ దహనం అయ్యారు. 

స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బొమ్మడి నాగరాజు ఇంట్లో నుంచి తెల్లవారుజామున పొగలు వచ్చాయి. దగ్గరికి వెళ్లి చూడగా గ్యాస్ సిలిండర్ పేలడంతో వచ్చిన మంటల్లో నిద్రిస్తున్న బొమ్మడి నాగరాజు (35), కుమారుడు రోహిత్ కుమార్ (6) విగతజీవులుగా కనిపించారు.

నాగరాజు భార్య, మరో కుమారుడు బంధువుల వివాహానికి ఊరు వెళ్లడంతో నాగరాజు రోహిత్ తో కలిసి ఇంట్లో ఉన్నాడు. ఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?