వెంకన్న భక్తుడిని కాబట్టి...: జగన్ కు రఘురామ ఆరు పేజీల లేఖ

By Sreeharsha GopaganiFirst Published Jun 29, 2020, 1:29 PM IST
Highlights

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆరు పేజీల లేఖ రాసారు. తనకు వచ్చిన షో కాజ్ నోటీసుకి ఇది రిప్లై కాదు అని స్పష్టంగా నొక్కి చెబుతూనే విజయసాయిరెడ్డి లేఖను ప్రస్తావించారు  రఘురామకృష్ణంరాజు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆరు పేజీల లేఖ రాసారు. తనకు వచ్చిన షో కాజ్ నోటీసుకి ఇది రిప్లై కాదు అని స్పష్టంగా నొక్కి చెబుతూనే విజయసాయిరెడ్డి లేఖను ప్రస్తావించారు  రఘురామకృష్ణంరాజు. ఈ లేఖలో తొలుత జగన్ మోహన్ రెడ్డికి ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగవ స్థానం రావడంపై శుభాకాంక్షలు తెలిపి త్వరలో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని అభిలాషించారు. 

తాను ఎప్పటినుండో అంటున్నట్టుగా వైసీపీ ఆహ్ యువజన శ్రామిక కాంగ్రెస్ రైతు పార్టీ ఆ అంటూ తన సవాల్ ను లేవనెత్తారు. ఎన్నికల కమిషన్ వైఎస్సార్ కాంగ్రెస్ అనే పేరును వాడకూడదు అని ఎన్నికల కమిషన్ గతంలో గుర్తు చేసిన విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. ఆ పేరు తమ పార్టీది కాదని అన్నారు.  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర తనకు షోకాజ్ నోటీసు జారీ అయిన నేపథ్యంలో రఘురామకృష్ణమ రాజు జగన్ కు ఆరు పేజీల లేఖ రాశారు.

తనకు వెంకటేశ్వరా స్వామికి వీర భక్తుడను అని, తనను తరచుగా యాంటీ క్రిస్టియన్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో ముఖ్యమంత్రిని నమ్మి హిందువులు కూడా ఓట్లేశారని, వెంట నిలబడ్డారని అన్నారు. రాజ్యాంగంలోని లౌకిక సిద్ధాంతానికి అనుగుణంగా మాత్రం ఎత్నాను మాట్లాడానని అన్నాడు. 

ఇంగ్లీష్ మీడియం విధానము గురించి మాట్లాడుతూ.... తాను రాజ్యాంగంలో పొందుపరిచినా విషయాలను గురించి మాత్రమే మాట్లాడానని, తనకు ఇప్పుడు షో కాజ్ నోటీసు ఇవ్వడమంటే... రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించడమే అని ఆయన వాపోయారు. 

ఇక ముఖ్యమంత్రి మీద తాను ఏదో దుష్ప్రచారానికి పాల్పడ్డట్టుగా ఒక వీడియో చలామణిలో ఉందని, తాను అలా చేసే వాడిని కాదని అది మార్ఫ్ చేసిన వీడియో అని అన్నాడు. అందుకు సంబంధించిన వస్తావా వీడియోను మిథున్ రెడ్డి, జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డిలకు షేర్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. 

ఇసుక విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.... తానే ముందుగా ఈ వ్యాఖ్యలు చేయలేదని, కేవలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యాఖ్యలను తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం  అన్నాడు.  చాలా  సార్లు తమను కలిసి ఈ విషయం చర్చిద్దామనుకున్నప్పటికీ అవకాశం దక్కలేదను వాపోయాడు. 

ఢిల్లీలో ఇచ్చిన విందు గురించి మాట్లాడుతూ.... తాను గోదావరి రుచులను అందరికి పరిచయం చేయడానికి మాత్రమే విందును ఏర్పాటు చేసానని, దానికి అన్ని పార్టీల ఎంపీలు ఉన్నారని అన్నారు. 

తనకు ప్రాణ హాని ఉందని, వరుస బెదిరింపులు వస్తుండడంతో డీజీపీని కూడా ఈ విషయంలో కలిసే ప్రయత్నం చేసానని, రాష్ట్ర పోలీసులు తనను పట్టించుకోకపోవడంతో... తాను గత్యంతరంలేక స్పీకర్ ఓం బిర్లా గారికి తనకు రక్షణ కల్పించమని కోరినట్టు చెప్పారు. 

తనకంటే ముందు శ్రీ రంగనాథ రాజు వంటి నాయకులు, స్వయంగా ఆయన మంత్రి, ఆయన సైతం అవినీతి ఆరోపణలు చేసారని, కానీ వారెవ్వరిపై చర్యలు తీసుకోకుండా తన ఒక్కడిపైన్నే ఇలా చర్యలు తీసుకోవడం అర్థమవడంలేదని, పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడి ఆదేశాలానుసారం తనపై అసత్య ప్రచారం జరగడంతోపాటుగా తనను టార్గెట్ చేసారని అన్నారు. 

ఇక టీవీ డిబేట్ల గురించి మాట్లాడుతూ... తానెప్పుడూ కావాలని ఏ ఛానల్ కి వెళ్లలేదని, కేవలం తన భావాలను వ్యక్థపరిచే మాధ్యమంగా చూశానని అన్నాడు. ఇక తానెప్పుడూ కూడా ప్రభుత్వాన్ని విమర్శించలేదని, కేవలం తులనాత్మక విశ్లేషణ మాత్రమే చేసానని అన్నాడు. 

తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సైనికుడనని, ఎప్పుడు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. ఈ లేఖ ద్వారా తనపై జరిగిన అవస్థపు ప్రచారాలను ఖండించాలనుకొని మాత్రమే ఈ లేఖను రాస్తున్నానని, త్వరో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తారని ఆశిస్తున్నాను అంటూ ముగించాడు. 

ఇక ఒక ఆసక్తికర అంశం ఏమిటంటే....ఈ లేఖ మీడియాకు అందే కొద్దిసేపటి ముందు మోడీని కీర్తిస్తూ ఒక పాటను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసారు.  

click me!