ఆంధ్రప్రదేశ్ మీద సైబర్ అటాక్ ప్రమాదం

Published : Sep 29, 2017, 05:26 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఆంధ్రప్రదేశ్ మీద సైబర్ అటాక్ ప్రమాదం

సారాంశం

బ్లూ వేల్స్ లాంటి ప్రమాదకర గేమ్స్ మరి కొన్ని వచ్చే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్ మీద సైబర్ అటాక్ ప్రమాదం ఉందని రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేశ్ అధికారులను అప్రమత్తం చేశారు.

సచివాలయంలో ఐ.టి శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడకంలో ఏపి ప్రభుత్వం అందరికంటే ముందు ఉన్నందున  సైబర్ ఎటాక్స్ జరిగే ప్రమాదం కూడా పెద్ద ఎత్తున ఉందని అన్నారు. దీని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కూడా ఆయన  సూచించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేశ్ అన్నారు.

బ్లూ వేల్స్ లాంటి ప్రమాదకర గేమ్స్ మరి కొన్ని వచ్చే ప్రమాదం కూడా ఉందని లోకేశ్ హెచ్చరించారు.  ఇలాంటి సైబర్ ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి నివారించే స్థాయితో ఒక  సెంటర్ ఏర్పాటు చెయ్యాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

లోకేశ్ ఇంకా ఏమన్నారంటే...

ప్రపంచ వ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ప్రతి సెకనుకు 12 మంది సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నారు. ర్యాన్సమ్ వేర్ ద్వారా సైబర్ ఎటాక్స్ తో ప్రభుత్వాల దగ్గర ఉన్న సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ దాడుల నుండి ప్రభుత్వ సమాచారాన్ని,ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అత్యుత్తమ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్,సాఫ్ట్ వేర్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ ప్రధాన లక్ష్యాలుగా ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటుచేయాలి.

సైబర్ సెక్యూరిటీ కోసం ఇతర దేశాల్లో రూపోయిందించిన విధివిధానాలు,మన రాష్ట్ర పరిస్థితులు అంచనా వేసి వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు పూర్తి చెసే విషయం అధికారులు చూడాలి. సైబర్ క్రైమ్స్ నియంత్రణ కోసం పోలీస్ శాఖ సలహాలు తీసుకొని సైబర్ సెక్యూరిటీ విధి విధానాలను రూపొందించాలి

 

 

PREV
click me!

Recommended Stories

వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu
Jogi Ramesh Open Challenge: టైం, డేట్ చెప్పు నేను రెడీ లోకేష్ కి జోగిరమేష్ ఛాలెంజ్| | Asianet Telugu