కేసీఆర్ తో జగన్ లాలూచీ రాజకీయం: లోకేష్

By Nagaraju TFirst Published Jan 29, 2019, 9:50 PM IST
Highlights

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతల పనిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీని విమర్శించేందుకే వైసీపీ పోటీగా సభలు పెడుతోందని విమర్శించారు. వైసీపీ అభిమాని జగన్‌ను పొడిస్తే ఆ నింద టీడీపీపై వేశారని చెప్పుకొచ్చారు. ఏపీ పోలీసులు చెప్పిందే ఎన్‌ఐఏ కూడా చెప్పిందని గుర్తుచేశారు. 

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పెద్ద డ్రామా పార్టీ అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌, కేసీఆర్‌తో కలిసి చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలను తిట్టిన కేసీఆర్‌తో కలిసి జగన్‌ రాజకీయాలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. 

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతల పనిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీని విమర్శించేందుకే వైసీపీ పోటీగా సభలు పెడుతోందని విమర్శించారు. వైసీపీ అభిమాని జగన్‌ను పొడిస్తే ఆ నింద టీడీపీపై వేశారని చెప్పుకొచ్చారు. ఏపీ పోలీసులు చెప్పిందే ఎన్‌ఐఏ కూడా చెప్పిందని గుర్తుచేశారు. 

లోటు బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అప్పగిస్తే దాన్ని అభివృద్ధిబాట పట్టించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చెయ్యడంలో మాత్రం ముందు ఉన్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 లక్షల కుటుంబాలకు పెన్షన్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు. 

రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఘనత తమదేనని చెప్పుకొచ్చారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని స్పష్టం చేశారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ఎంతో మంది వచ్చి ఏపీలో పరిశ్రమలు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. 

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని ప్రశ్నిస్తే కేసులు పెడుతోందని ఆరోపించారు. మోదీ భయపడాలే తప్ప చంద్రబాబు ఎప్పుడూ భయపడరన్నారు. బుధవారం నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరుకావాలని లోకేష్ కోరారు. 
 
click me!