జగన్ రెడ్డి సింగిల్ గా వచ్చే సింహమా! వీధి కుక్క కూడా కాదు..: గుంటూరు యూట్యూబర్ అరెస్ట్ పై లోకేష్ సీరియస్

By Arun Kumar PFirst Published Jun 30, 2022, 10:10 AM IST
Highlights

అర్థరాత్రి గుంటూరు పోలీసులు వెంకటేష్ అనే యూట్యూబర్, టిడిపి కార్యకర్తను బలవంతంగా అరెస్ట్ చేయడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. 

అమరావతి : గుంటూరు జిల్లాలో అర్థరాత్రి టిడిపి కార్యకర్త, యూట్యూబర్ వెంకటేష్ ఇంటివద్ద అర్థరాత్రి అలజడి సృష్టించి అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వెంకటేష్ ఇంట్లోకి బలవంతంగా చొరబడిన పోలీసులు అతడిని, కుటుంబసభ్యులను బెదిరిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ పోలీసులపై లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ముఖ్యమంత్రి జగన్ మీడియాను చూస్తేనే కాదు సోషల మీడియాను చూసికూడా వణికిపోయే పిరికోడని లోకేష్ అన్నారు. యూట్యూబ్ ఛానెల్స్ లో వచ్చే థంబ్ నెయిల్స్ చూసికూడా జడుసుకునే సీఎం ఈ జగన్ రెడ్డి. అలాంటి జగన్ రెడ్డి సింగిల్ గా వచ్చే సింహం అంటూ వైసిపి నాయకులు చెప్పుకుంటున్నారని... కానీ ఆయన వీధి కుక్క కూడా కాదని ఎద్దేవా చేసారు. ఇలాంటి పిరికోడు పిల్లల ముందు బిల్డప్ ఇస్తూ నా ఎంట్రుక కూడా పీకలేరంటూ స్టేట్ మెంట్స్ ఇవ్వడం ఎందుకు? అంటూ లోకేష్ నిలదీసారు. 

ఏపీ పోలీసుల తీరుపైనా లోకేష్ సీరియస్ అయ్యారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త, యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడు వెంకటేష్ ను అర్థరాత్రి అరెస్ట్ చేయడాన్ని లోకేష్ ఖండించారు. అర్ధరాత్రి సివిల్ డ్రెస్ లో వచ్చిన పోలీసులు కనీసం ఐడెంటిటీ కార్డు చూపించకుండా వెంకటేష్ కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేసారని అన్నారు. ఇంటి గేటును  తెరవాలని... లేదంటే మీపైనా కేసులు పెట్టాల్సి వస్తుందని వెంకటేష్ కుటుంబాన్ని బెదిరించడం దారుణమన్నారు.  

పోలీసులు అర్ధరాత్రి దొంగల్లా వెంకటేష్ ఇంటి ప్రహారిగోడ దూకడం, గునపాలతో తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించి భయానక వాతావరణం సృష్టించారని లోకేష్ తెలిపారు. ఇలా కొంతమంది పోలీసులు వైసిపి గూండాలను మించిపోయారని అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే ఇంత రాద్దాంతం చేస్తారా? అంటూ పోలీసులపై లోకేష్ మండిపడ్డారు. 

పోలీసులు కనపడకుండా ఉండటానికి లైట్లు పగలగొట్టినా వారి మొఖాలన్నీ స్పష్టంగా వీడియోలో రికార్డ్ అయ్యాయని లోకేష్ అన్నారు. కేవలం జగన్ రెడ్డి ప్రాపకం కోసం చట్టాన్ని అతిక్రమించి అడ్డదారులు తొక్కుతున్న వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదంటూ లోకేష్ పోలీసులను తీవ్రంగా హెచ్చరించారు. టిడిపి కార్యకర్త వెంకటేష్ కు పార్టీ నాయకులమంతా అండగా వుంటామని... కుటుంబసభ్యులు ఆందోళన చెందవద్దని లోకేష్ భరోసా ఇచ్చారు.

ఇదిలావుంటే ఇటీవల చిత్తూరు నగర అధ్యక్షురాలు, మాజీ మేయర్ కఠారి హేమలతతో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా లోకేష్ తీవ్రంగా స్పందించారు. మాజీ మేయర్ అని కాదు కనీసం మహిళ అని కూడా చూడకుండా ఆమెను పోలీస్ వాహనంతో ఢీకొట్టి గాయపర్చడం దారుణమని అన్నారు. అధికార పార్టీ మెప్పుకోసం ప్రతిపక్ష పార్టీకి చెందిన మహిళ అన్న ఒకేఒక్క కారణంతో అర్థరాత్రి  పోలీసులు ఇంత అమానుషంగా వ్యవహరించడం సిగ్గుచేటని లోకేష్ మండిపడ్డారు. 

తన అత్తామామ హత్యకేసులో సాక్షులకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడమే మాజీ మేయర్ హేమలత చేసిన నేరమా పోలీసులూ! అని లోకేష్ నిలదీసారు. ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న పోలీసులా! వైఎస్ జగన్ మాఫియా రెడ్డి ఫ్యాక్షన్ నడిపే ప్రైవేట్ సైన్యమా? అంటూ ఎద్దేవా చేసారు. పోలీసులే అమాయకుడైన పూర్ణ జేబులో గంజాయి పెట్టి అమ్ముతున్నాడని అరెస్టు చేయడం... ఇదేం అన్యాయం అని నిలదీసిన హేమలత మీద నుంచి పోలీసు వాహనం పోనిచ్చారంటే వీళ్లంతా పోలీసులు కాదు.... వైసీపీ ఫ్యాక్షన్ టీం అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. 

click me!