హైద్రాబాద్‌లో రఘురామ కేసుల విచారణ: ఏపీ హైకోర్టు సీఐడీకి గ్రీన్ సిగ్నల్

By narsimha lode  |  First Published Jun 30, 2022, 9:47 AM IST

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై నమోదైన కేసుల్లో కొన్నింటిని హైద్రాబాద్ లోని దిల్ కుషా అతిథి గృహంలో విచారించేందుకు ఏపీ హైకోర్టు సీఐడీకి అనుమతిని ఇచ్చింది. ఈ విషయమై నిన్న విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. 


అమరావతి: YCP రెబెల్ ఎంపీ Raghu Rama Krishnam Rajuపై నమోదైన కేసుల్లో  కొన్నింటిని Telangana రాష్ట్రంలోని Hyderabad లో విచారించేందుకు AP CIDకి హైకోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే రాజద్రోహం కింద నమోదైన కేసు విషయంలో మాత్రం కోర్టు మినహాయింపు ఇవ్వలేదు.

తనపై నమోదైన 153ఎ, 505,120 ఎ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు AP High Courtను ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై  బుధవారం నాడు విచారణ నిర్వహించిన హైకోర్టు కీలక ఆదేశాలను ఇచ్చింది.

Latest Videos

ఈ కేసులో సీఐడీ తరపున వివేకానంద వాదించారు. పిటిషనరైన ఎంపీ రఘురామకృష్ణం రాజు తరపున బి. ఆదినారాయణరావు తన వాదనలు విన్పించారు.  ఆన్ లైన్ ద్వారా ఈ కేసు విచారణ సాధ్యమా అనే విషయమై పరిశీలించాలని కోర్టు సీఐడీకి సూచించింది. అయితే ఈ విషయమై సీఐడీ తరపున  న్యాయవాది వివేకానంద వాదించారు. ఆన్ లైన్ ద్వారా విచారణతో ఇబ్బందులున్నాయని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. సీఐడీ కార్యాలయంలో విచారణ నిర్వహిస్తామని చెప్పారు. అయితే హోటల్ గదిలో విచారణకు అభ్యంతరం లేదని ఎంపీ తరపు న్యాయవాది ఆదినారాయణరావు చెప్పారు. అయితే ఈ వాదనతో కోర్టు అంగీకరించలేదు.  

ప్రైవేట్ స్థలంలో విచారణ సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది.  రాజద్రోహం అమలును సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన విషయాన్ని కూడా ఎంపీ తరపు న్యాయవాది ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైద్రాబాద్ లో దిల్ కుషా గెస్ట్ హౌస్ లేదా మసాబ్ ట్యాంక్ పోలీస్ మెస్ లో విచారించేందుకు సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

ఇదే కేసులో  రెండు మీడియా చానల్స్ ను కూడా కలిపి విచారణ చేయాలని భావిస్తే 15 రోజుల ముందుగానే నోటీసులు ఇవ్వాలని కోర్టు సీఐడీకి సూచించింది. విచారణ ప్రక్రియను మొత్తం  వీడియో రికార్డు చేయాలని కూడా హైకోర్టు సీఐడీని ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా  మీడియాలో వ్యాఖ్యలు చేశారని  ఏపీ సీఐడీ అధికారులు 2021 మే 14న రఘురామకృష్ణంరాజును హైరదాబాద్ లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ  ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యవహరించారని 124-ఏ , Ipc  153 - బీసెక్షన్ కింద సీఐడీ కేసు నమోదుచేసింది. దీంతో పాటుగా ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.  ఈ కేసులో  ఆయనను సీఐడీ అరెస్ట్ చేసింది.

also read:రఘురామకృష్ణరాజును టీవీ చర్చలకు అనుమతించకండి.. సంసద్ సీఈవోకు విజయసాయి రెడ్డి లేఖ

తనపై నమోదైన కేసుల విషయమై పలు కోర్టుల్లో రఘురామకృష్ణంరాజు పిటిషన్లు దాఖలు చేశారు. చివరకు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో 2021 మే 21న రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. 

click me!