ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రని చెప్పుకుంటున్న జగన్..: నారా లోకేష్ సంచలనం

By Arun Kumar PFirst Published Jun 23, 2022, 2:29 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరికో పుట్టిన బిడ్డకు తానే తండ్రిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో చంద్రబాబు సీఎంగా టిడిపి ప్రభుత్వం అధికారంలో వుండగా ఏపీలో పెట్టుబడికి సిద్దమైన కంపనీలను తామే తీసుకువచ్చినట్లుగా వైసిపి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని లోకేష్ ఆరోపించారు. ఈ సందర్భగా సోషల్ మీడియాలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.  

''జగన్ రెడ్డి ది సిగ్గు లేని జన్మ... ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ జగన్ రెడ్డి తెచ్చింది కాదు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు గారు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం వ్యసనంగా మారిన జగన్ రెడ్డి మరోసారి ఆ ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు'' అంటూ సీఎం జగన్ పై లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఇక ఇటీవల ముఖ్యమంత్రి జగన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొనేందుకు చేపట్టిన దావోస్ పర్యటనపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.  ''సింగడు అద్దంకి పోయి వచ్చిన సామెతలా ఉంది జగ్గడి దావోస్ పర్యటన. సింగడు అద్దంకి ఎందుకో పోయాడో ఎందుకు వచ్చాడో తెలీదు అనే మన తెలుగు సామెతను జగ్గడు మళ్లీ గుర్తుకు తెచ్చారు. జగ్గడు అసలు దావోస్ ఎందుకు పోయారో... ఏమి తెచ్చారో ఎవరికీ తెలీదు. అసలే అంతంత మాత్రం గా ఉన్న ఆర్థిక పరిస్థితికి స్పెషల్ ఫ్లైట్ విలాసాల ఛార్జీల మోత అదనపు భారం తప్ప...రాష్ట్రానికి పైసా లాభం లేదు'' అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.  

ఇదిలావుంటే ఇటీవల టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను నర్పీపట్నం అధికారులు కూల్చివేయడంపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని లోకేష్ ఎద్దేవా చేశారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగన్ గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలెట్టారని అన్నారు. 

అయన్నపాత్రుడిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా లోకేష్ చెప్పారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందని లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

 

 

click me!