జగన్ ట్యాక్స్ వసూళ్లు రూ.30వేల కోట్లే పెట్టుబడులా..?: మంత్రి మేకపాటిపై లోకేష్ సెటైర్లు

By Arun Kumar PFirst Published Jun 9, 2021, 2:59 PM IST
Highlights

ప్రెసిడెంట్ మెడ‌ల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ కంపెనీలేనా మీరు రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలు అంటూ మంత్రి మేకపాటిపై నారా లోకేష్ సెటైర్లు విసిరారు. 

మంగళగిరి: రెండేళ్ల వైసిపి పాలనలో ఏపీ పారిశ్రామికంగా బాగా పురోగతి సాధించిందని... చాలా కంపనీలు ఏపీకి వచ్చి భారీ పెట్టుబడులు పెట్టాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రి ప్రకటనపై టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ... ప్రెసిడెంట్ మెడ‌ల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ కంపెనీలేనా మీరు తెచ్చినవి అంటూ సోషల్ మీడియా వేదికన ఎద్దేవా చేశారు. 

''గౌర‌వ‌నీయులైన ప‌రిశ్ర‌మ‌ల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారూ... రెండేళ్ల మీ పాల‌న‌లో ఉన్న ప‌రిశ్ర‌మల్ని బెదిరించి వ‌సూలు చేసిన జే-ట్యాక్స్(జ‌గ‌న్ ట్యాక్స్‌) 30 వేల కోట్ల‌నే వ‌చ్చిన పెట్టుబ‌డులు అని చెప్పిన‌ట్టున్నారు. 65 భారీ ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాట‌య్యాయ‌ని సెల‌విచ్చారు. ప్రెసిడెంట్ మెడ‌ల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ కంపెనీలు త‌ప్పించి కొత్త‌గా వ‌చ్చిన కంపెనీల్లేవు. టిడిపి ఐదేళ్ల పాల‌న‌లో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ 3,4వ స్థానాల్లో వుంటే, రెండేళ్ల వైఎస్ జగన్  పాల‌న‌లో 13వ స్థానంలో వుంది'' అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.

read more  నా ఆవేదన మాటల్లో వ్యక్తం చేయలేను...: సీఎస్ కు రాసిన లేఖలో చంద్రబాబు

''చంద్ర‌బాబు తీసుకొచ్చిన కియా యాజ‌మాన్యాన్ని వైసీపీ ఎంపీలే వీధిరౌడీల కంటే ఘోరంగా బెదిరించ‌డం చూశాక ఏ విదేశీ కంపెనీ ఏపీ కి వస్తుంది? జే ట్యాక్స్ చెల్లించ‌ని కంపెనీల‌పై పీసీబీని ప్ర‌యోగించి మూయించేస్తుంటే, ఇంకెవ‌రు కొత్త‌గా పెట్టుబ‌డి పెడ‌తారు?'' అని లోకేష్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
 

click me!