రేపు ఢిల్లీకి వైఎస్ జగన్: అమిత్‌షా సహా పలువురు మంత్రులతో భేటీకి ఛాన్స్

By narsimha lode  |  First Published Jun 9, 2021, 2:20 PM IST

  ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 10న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాటు పలువురు కేంద్ర మంత్రులను  జగన్ కలిసే అవకాశం ఉంది. 


అమరావతి:  ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 10న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాటు పలువురు కేంద్ర మంత్రులను  జగన్ కలిసే అవకాశం ఉంది. గురువారం నాడు ఉదయం 11 గంటలకు జగన్  ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు  కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు, విభజన హామీలతో పాటు  కేంద్రం నుండి రావాల్సిన బకాయిలపై జగన్ చర్చించనున్నారు. 

గత వారంలోనే  జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే  కొన్ని కారణాలతో ఈ పర్యటన రద్దైంది.  పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ఫిక్స్ కావడంతో జగన్  రేపు ఢిల్లీకి వెళ్లనున్నారని  అధికారవర్గాలు తెలిపారు. రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ తర్వాత తొలిసారిగా జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. రఘురామకృష్ణంరాజు జగన్ సర్కార్ పై తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. దీంతో జగన్ పర్యటనపై రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.  రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన ఎపిసోడ్ ఏపీ రాజకీయాలను వేడేక్కించింది. ఈ విషయమై రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు

Latest Videos

click me!