విజయవాడ కోవిడ్ సెంటర్లో అగ్నిప్రమాదం... దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన లోకేష్

By Arun Kumar PFirst Published Aug 9, 2020, 8:12 AM IST
Highlights

విజయవాడ కోవిడ్ సెంటర్ లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

గుంటూరు: విజయవాడ కోవిడ్ సెంటర్ లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురయి స్వర్ణ ప్యాలస్ ప్రైవేట్ కోవిడ్ సెంటర్ లో చికిత్స పొందుతున్న బాధితులు అగ్నిప్రమాదంలో చనిపోవడం బాధాకరం అన్నారు. 

''ఇప్పటికే ఈ అగ్నిప్రమాదంలో కొందరు చనిపోయారని ప్రాథమిక సమాచారం. వారి మృతి పట్ల సంతాపం తెలుపుతున్నాను. ఇదే కోవిడ్ సెంటర్ లో 50 మంది చికిత్స పొందుతున్నారు అని సమాచారం. కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. రెస్క్యూ ఆపరేషన్ త్వరగా పూర్తి చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి'' అని ప్రభుత్వానికి లోకేష్ సూచించారు.

read more   బ్రేకింగ్... విజయవాడ కోవిడ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి (వీడియో)

విజయవాడలో కరోనా వైరస్ చికిత్స కోసం రమేష్ హాస్పిటల్ ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో హాస్పిటల్ లో 40మంది కరోనా పేషంట్స్ తో పాటు 10 మంది వరకు వైద్య సిబ్బంది వున్నట్లు సమాచారం. ఈ మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు బిల్డింగ్ లో వున్నవారిని ఉక్కిరిబిక్కిరి  చేశాయి. దీంతో వారు కిటీకీల వద్దకు చేరుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. 

 ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే హాస్పిటల్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం ఈ ప్రమాదంలో మరింత అస్వస్ధతకు గురయిన పేషెంట్స్ ఇతర కోవిడ్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు మృత్యువాతపడగా చాలామంది తీవ్ర అస్వస్ధతకు గురయినట్లు తెలుస్తోంది. 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ  అగ్నిప్రమాదం చోటుచేసుకుని వుంటుందని... మంటలను ఎవ్వరూ గమనించకపోవడంతో బిల్డింగ్ మొత్తం వ్యాపించి వుంటాయని అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. 

click me!