మోడీకి కౌంటర్: అవినీతికి పాల్పడినట్టు రుజువు చేయండి: లోకేష్

Published : Feb 10, 2019, 03:21 PM IST
మోడీకి కౌంటర్: అవినీతికి పాల్పడినట్టు రుజువు చేయండి: లోకేష్

సారాంశం

రాష్ట్రంలో తాము అవినీతికి పాల్పడినట్టుగా రుజువు చేయాలని ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.


తిరుపతి: రాష్ట్రంలో తాము అవినీతికి పాల్పడినట్టుగా రుజువు చేయాలని ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

ప్రధానమంత్రి మోడీ విమర్శలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఆదివారం నాడు తిరుపతిలో స్పందించారు.అసలు ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి ఎందుకు వచ్చినట్టు లోకేష్ ప్రశ్నించారు.ప్రత్యేక హోదా ఇస్తానని మోడీయే చెప్పాడని లోకేష్ గుర్తు చేశారు. 

ఉపాధిహామీ స్కీమ్ కింద రాష్ట్ర ప్రజల కష్టమన్నారు. ఇందులో కేంద్రం ఇచ్చేదేముందన్నారు. ప్రత్యేక రైల్వేజోన్, కడప ఉక్కు ప్రధానికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

ఎన్డీఏలో ఉన్న సమయంలో  మా అవినీతి గుర్తు రాలేదా అని ఆయన చెప్పారు.2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు బీజేపీకి గుణ పాఠం చెబుతారని లోకేష్ చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని లోకేష్ అభిప్రాయపడ్డారు.  వచ్చే ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేసే వ్యక్తిని ప్రధానమంత్రిని బాబు చేస్తారని లోకేష్ చెప్పారు.

ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించుకోవాలని రూ.1500 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు.  ఈ నిధులతో రాజధాని ఢిల్లీని తలదన్నే నిర్మాణం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

గురువుకు పంగ నామాలు పెట్టారు: మోడీపై బాబు

మామను వెన్నుపోటు పొడవడంలో సీనియర్: బాబుపై మోడీ తీవ్ర వ్యాఖ్యలు

PREV
click me!

Recommended Stories

రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments
సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna