యాగంటి బసవయ్య మండపం ధ్వంసం: నారా లోకేష్ సీరియస్

By Arun Kumar PFirst Published Jan 28, 2021, 2:33 PM IST
Highlights

గూడూరులో అక్రమ గ్రావెల్ మైనింగ్ వెనుక ఉన్న వైకాపా ముఖ్య నాయకుల పాత్రపై విచారణ చేపట్టాలని టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. 

అమరావతి: నెల్లూరు జిల్లా గూడూరులో వీఆర్ఓపై జరిగిన దాడిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు.  అక్రమాలను అడ్డుకోడానికి ప్రయత్నించినందుకు స్థానిక  వైసిపి నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికన ప్రభుత్వంపై, వైసిపి నాయకులపై విమర్శలు గుప్పించారు లోకేష్.

''నెల్లూరు జిల్లాలో వైకాపా అక్రమ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. గూడూరు లో అక్రమ గ్రావెల్ తరలింపుని అడ్డుకున్న విఆర్ఓ హనుమంతరావు గారి పై వైకాపా నాయకుడు కోటేశ్వరరావు, అతని అనుచరులు కలిసి దారుణంగా దాడి చేసారు. వైఎస్ జగన్ అరాచక పాలనలో ఉద్యోగస్తులకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయింది'' అని లోకేష్ ట్విట్టర్ వేదికన ఆరోపించారు.

రామతీర్థంలో నూతన సీతారాముల విగ్రహాల ప్రతిష్ట

''గూడూరులో అక్రమ గ్రావెల్ మైనింగ్ వెనుక ఉన్న వైకాపా ముఖ్య నాయకుల పాత్రపై విచారణ చేపట్టాలి. విఆర్ఓ పై దాడి చేసిన వైకాపా రౌడి గ్యాంగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. గాయపడిన విఆర్ఓ హనుమంతరావు గారికి మెరుగైన వైద్యం అందించాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు. 

''వైఎస్ జగన్ మైనింగ్ మాఫియా విచ్చల విడిగా చెలరేగిపోతోంది. కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి సమీపంలో అక్రమ బ్లాస్టింగ్ వలన బసవయ్య మండపం దెబ్బతింది. గుడికి సమీపంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోందని ఫిర్యాదులు అందినా ప్రభుత్వం గుడ్డిగా ఉండటం వలనే దేవాలయం దెబ్బతింది'' అన్నారు.

''గుడికి సమీపంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వైకాపా కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలి. దేవాలయం సమీపంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వెంటనే ఆపాలి. దెబ్బతిన్న మండపానికి వెంటనే మరమ్మతులు చెయ్యాలి'' అని ప్రభుత్వాన్ని కోరారు నారా లోకేష్. 
 

click me!